Begin typing your search above and press return to search.

రేపే నితిన్ - షాలినిల ఎంగేజ్మెంట్...!

By:  Tupaki Desk   |   21 July 2020 11:30 AM GMT
రేపే నితిన్ - షాలినిల ఎంగేజ్మెంట్...!
X
టాలీవుడ్ యువ హీరో నితిన్ పెళ్లి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. నితిన్ - షాలినిల వివాహం జూలై 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకి శుభముహూర్తాన వైభవంగా నిర్వహించబోతున్నారు. కాగా ఫిబ్రవరిలో పసుపు కుంకుమ ఫంక్షన్ చేసుకున్న నితిన్ - షాలిని జంట రేపు అనగా జూలై 22న ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు మరియు కొంతమంది ఫ్రెండ్స్ హాజరుకానున్నారని సమాచారం.

వాస్తవానికి నితిన్ - షాలినిల వివాహం ఏప్రిల్ నెలలోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో జూలై 26న హైదరాబాద్ లోనే వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే హీరో నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాహ ఆహ్వానపత్రిక అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ని అనుసరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహం జరిపించడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితుల వల్ల నితిన్ - షాలిని వివాహ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది స్నేహితులు ప్రముఖుల సమక్షంలో జరిపించనున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే నితిన్ ఈ ఏడాది ప్రారంభంలో 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్ లో వరుసగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు నితిన్. ఈ క్రమంలో ముందుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతేకాకుండా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా మరియు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాదున్' తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. వీటితో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేయనున్నాడు.