Begin typing your search above and press return to search.

నితిన్ 'భీష్మ' ..ఇక లాంఛ‌న‌మే!

By:  Tupaki Desk   |   28 May 2019 6:32 AM GMT
నితిన్ భీష్మ ..ఇక లాంఛ‌న‌మే!
X
`శ్రీ‌నివాస క‌ళ్యాణం` త‌ర్వాత నితిన్ చేస్తున్న ప్రాజెక్టులేవి? అంటే స‌రైన ఆన్స‌ర్ లేదు. నితిన్ ఆ తర్వాత చాలా క‌థ‌లు విన్నారు. ఓ న‌లుగురు ద‌ర్శ‌కుల్ని ఫైన‌ల్ చేసేవారు. అయితే ఈసారి స్క్రిప్టు విష‌యంలో నితిన్ ఎంత‌మాత్రం రాజీకి రాలేద‌ని తెలుస్తోంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చంద్ర శేఖ‌ర్ ఏలేటితో ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన నితిన్ అటుపై ఛ‌లో ఫేం వెంకీ కుడుముల‌.. రౌడీ ఫెలో ఫేం కృష్ణ చైత‌న్య ప్రాజెక్టుల్ని క‌న్ఫామ్ చేశారు. వీళ్ల‌తో పాటు గుండె జారి గ‌ల్లంత‌య్యిందే ఫేం విజ‌య్ కుమార్ కొండా నితిన్ కి లైన్ వినిపించి స్క్రిప్టును డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నార‌ని ప్ర‌చార‌మైంది. మ‌రోవైపు కుమారి 21ఎఫ్ ద‌ర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్ నితిన్ కోసం క‌థ రెడీ చేస్తున్న సంగ‌తి పైనా తామ‌ర తంప‌ర‌గా వార్త‌లు వ‌చ్చాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం... నితిన్ - వెంకీ కుడుములు కాంబినేషన్ లో రూపొందనున్న `భీష్మ` సినిమా జూన్ 7న ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. భీష్మ ప‌క్కా హిలేరియ‌స్ క‌మ‌ర్షియ‌ల్ బొమ్మ!! అంటూ ఇదివ‌ర‌కూ ట్విట్ట‌ర్ లో వివ‌రాలు అందించారు. ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై `జెర్సీ` ఫేం సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు నితిన్ క్యూలో మూడు సినిమాల సంగ‌తులు తెలిశాయి.

ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా 2019 చివ‌రిలో ప్రారంభించి 2020లో రిలీజ్ చేస్తామ‌ని నితిన్ ఇంత‌కుముందు ప్ర‌క‌టించారు. సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్ లో నిఖితా రెడ్డి- సుధాక‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ``నా కెరీర్ లోనే యాంబిషియ‌స్ ఛాలెంజింగ్ మూవీ ఇది.. సూప‌ర్ కిక్ తో ఉన్నా`` అంటూ నితిన్ ఆనందం వ్య‌క్తం చేశాడు. చంద్ర శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో అవ‌య‌వ‌దానం నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో కంట‌త‌డి పెట్టించే ఎమోష‌న్ ఉంటుంద‌ని.. చ‌క్క‌ని సామాజిక సందేశం ఉండేలా ద‌ర్శ‌కుడు క‌థాంశాన్ని తీర్చిదిద్దార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చారం సాగింది. త్వ‌ర‌లోనే త‌న ప్రాజెక్టుల‌కు సంబంధించి నితిన్ అధికారికంగా వివ‌రాలందిస్తారేమో చూడాలి.