Begin typing your search above and press return to search.

లుంగీ క‌ట్టిన మోహ‌న‌రంగ‌

By:  Tupaki Desk   |   4 April 2018 6:53 AM GMT
లుంగీ క‌ట్టిన మోహ‌న‌రంగ‌
X
నితిన్ హీరోగా న‌టించిన 25వ చిత్రం ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’. నితిన్ జోడిగా ‘లై’ భామ మేఘా ఆకాష్ హీరోయిన్ గా న‌టించింది. రేపు విడుద‌ల‌వ్వ‌బోతున్న ఈ సినిమా నుంచి నితిన్ స్టిల్‌ ను రిలీజ్ పోస్ట‌ర్‌ గా విడుద‌ల చేసింది చిత్ర బృందం. బీరు బాటిళ్ల మ‌ధ్య కూర్చొని... మ‌త్తుగా చూస్తూ ఓ వెరైటీ ఫోజ్ పెట్టాడు నితిన్‌. బ్లాక్ అండ్‌ వైట్ టీ ష‌ర్ట్ మీద గ‌ల్ల‌ లుంగీ క‌ట్టుకుని మాస్ గా క‌నిపిస్తున్నాడు నితిన్‌.

నితిన్ వేసుకున్న చెప్పులు కూడా ఫ‌న్నీగా అనిపిస్తున్నాయి. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా... ఎలా ఉండ‌బోతుందో ఈ ఒక్క స్టిల్ చూస్తే తెలిసిపోతుంది. టైటిల్ కింద కూడా బాటిల్ కనిపిస్తుండ‌డం... ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్ అనే ట్యాగ్ లైన్‌ కి స‌రిపోయేలా ఉందీ నితిన్ ఫోజు. నితిన్ సినిమా కోసం ఓ కామెడీ ఫ‌న్నీ ల‌వ్ స్టోరీని అందించిన‌ట్టు తెలుస్తోంది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఇప్ప‌టికే విడుద‌లైన రిలీజ్ ప్రోమోలు చిన్న చిన్న పంచ్‌ ల‌తో త్రివిక్ర‌మ్ స్టైల్‌ ని గుర్తుకు తెస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్... శ్రేష్ట మూవీస్ క‌లిసి సంయుక్తం నిర్మిస్తున్న ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. ఆన్‌ లైన్‌ లో జోరుగానే బుకింగ్స్ జ‌రుగుతున్నాయి కూడా.

నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘అ ఆ’ లాగే... ఇది కూడా సింపుల్ గా విడుద‌ల‌య్యి... భారీ హిట్టు అయ్యే సంకేతాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పాట‌ల ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.