Begin typing your search above and press return to search.

అప్పుడే పవర్‌స్టార్‌ ఫ్యాన్‌ గెస్ట్‌ రోలా?

By:  Tupaki Desk   |   13 April 2015 1:00 PM IST
అప్పుడే పవర్‌స్టార్‌ ఫ్యాన్‌ గెస్ట్‌ రోలా?
X
అక్కినేని అఖిల్‌, హీరో నితిన్‌ ఇద్దరూ క్లోజ్‌ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే. క్లబ్బు, పబ్బు, విందు-వినోదం.. ఎందెందైనా ఈ ఇద్దరూ కలిసే ఛీర్స్‌ చేస్తుంటారు. ఆ స్నేహంతోనే అఖిల్‌ ఆరంగేట్ర చిత్రాన్ని నిర్మించడానికి నితిన్‌ ముందుకొచ్చాడు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నితిన్‌. తండ్రి సుధాకర్‌రెడ్డి, అక్క నిఖితారెడ్డి అండదండలు, ఆర్థిక సాయం ఈ ప్రాజెక్టుకు పుష్కలంగా ఉన్నాయి.

అయితే నితిన్‌ కేవలం నిర్మాత పాత్ర వరకే పరిమితం కాలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులు చక్కబెడుతూనే తనకోసం వేచి చూస్తున్న ఓ అతిధి పాత్రలోకి పరకాయం చేస్తున్నాడు. అఖిల్‌ సినిమాలో ఓ కీలకపాత్రలో హీరో అవసరం. అది నితిన్‌ అయితే ఇంకా బావుంటుంది. ఆ పాత్రతో హైప్‌ మరింత పెరగడానికి ఆస్కారం ఉంది. అందుకే స్నేహం కోసం, తన సినిమా కోసం .. నటించడానికి ముందుకొచ్చాడు నితిన్‌. దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఈ ఇద్దరూ చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరిగే సన్నివేశమో.

ఇకపోతే పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్‌గా పాపులర్‌ అయిన నితిన్‌ అసలు అప్పుడే ఇలాంటి గెస్ట్‌ రోల్స్‌ చేయడం మంచిది కాదేమో అనేవారున్నారు. ఎందుకంటే గెస్ట్‌ రోల్స్‌ అనేవి అసమాన క్రేజ్‌ ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుంది. అది డెవలప్‌ చేసుకోకుండా స్పెషల్‌ రోల్స్‌ చేస్తే అసలుకే మోసం వచ్చేస్తుందని కొందరి ఫీలింగ్‌. మరి నితిన్‌ ఏమంటాడో...