Begin typing your search above and press return to search.

డబల్ ధమాకా ఇచ్చిన నితిన్..!

By:  Tupaki Desk   |   29 March 2019 5:19 PM GMT
డబల్ ధమాకా ఇచ్చిన నితిన్..!
X
టాలీవుడ్ హీరో నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై గత కొద్ది రోజులుగా కన్ఫ్యూజన్ నెలకొంది. కొద్ది రోజుల క్రితం.. కరెక్ట్ గా చెప్తే మార్చ్ 21 న అనౌన్స్ మెంట్ 1 అంటూ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నట్టుగా వెల్లడించాడు. ఆ చిత్రాన్ని భవ్య ఆనంద ప్రసాద్ గారు నిర్మిస్తారని..ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారని తెలిపాడు. దీంతో అప్పటి వరకూ ప్రచారంలో ఉన్న వెంకీ కుడుముల చిత్రం పై అనుమానాలు నెలకొన్నాయి. కానీ అప్పుడే క్లారిటీ ఇస్తూ.. తన సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇన్ ఫర్మేషన్ ను తప్ప మిగతా గాసిప్పులను పట్టించుకోవద్దని అభిమానులను కోరాడు.

ఈరోజు డబల్ ధమాకా అన్నట్టుగా నితిన్ నటించే మరో రెండు కొత్త ప్రాజెక్టుల ప్రకటన వచ్చింది. అనౌన్స్ మెంట్ 2: భీష్మ. 'ఛలో' వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక లోగో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. నితిన్ పెయింటింగ్ పై లిల్లీ పుట్స్ సైజులో చాలామంది అమ్మాయిలు జుట్టుపై.. కళ్ళజోడుపై.. నుదుటిపై ఉన్నారు. అంటే.. బాబు బాగా రొమాంటిక్ అన్నమాట.

'భీష్మ' ప్రకటన వచ్చిన కాసేపట్లోనే అనౌన్స్ మెంట్ 3 అంటూ మరో ప్రకటన కూడా వచ్చింది. ఈ ప్రకటన డైరెక్ట్ గా నితిన్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ లో నితిన్ నాన్నగారు సుధాకర్ రెడ్డి నిర్మిస్తారు. ఈ చిత్రం షూటింగును ఈ ఏడాది చివరలో ప్రారంభిస్తామని.. నెక్స్ట్ సమ్మర్ లో విడుదల చేస్తామని తెలిపాడు. ఈ సినిమాకు ప్రొడక్షన్ నెం. 6 అంటూ ఒక పోస్టర్ కూడా నితిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి దర్శకుడు కృష్ణ చైతన్య. పాటల రచయితగా తన సత్తా చాటి దర్శకత్వం వైపు అడుగులు వేసిన కృష్ణ చైతన్య ఇప్పటివరకూ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. నారా రోహిత్ హీరోగా తెరకెక్కించిన మొదటి సినిమా 'రౌడీ ఫెలో' ప్రేక్షకులనే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక రెండవ సినిమా నితిన్ హీరోగా తెరకెక్కిన 'ఛల్ మోహన్ రంగా'. ఈ సినిమా కూడా నిజానికి హిట్ కావాల్సిన సినిమా కానీ రాంగ్ రిలీజ్ టైమింగ్ లాంటి పలు కారణాల వల్ల కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. ఆ సినిమాలో కృష్ణ చైతన్య వర్క్ నచ్చడంతోనే మరోసారి నితిన్ సినిమాకు చేసేందుకు రెడీ అయ్యాడట. అంతే కాదు ఈ సినిమా కథ కూడా స్ట్రాంగ్ ఉందని.. అందుకే సొంత బ్యానర్ లో నిర్మించేందుకు నితిన్ ముందుకొచ్చాడని ఇన్ సైడ్ టాక్.

ఇంతకీ రెండు ప్రాజెక్టుల ప్రకటన ఇప్పుడే ఎందుకు వచ్చింది? నితిన్ పుట్టిన రోజు మార్చ్ 30 న జరుపుకుంటున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడన్నమాట.. కాదు కాదు. ఇది డబల్ ధమాకా!