Begin typing your search above and press return to search.

ఆ రీమేక్‌ లో చివరకు శ్రియ సెట్‌ అయ్యింది!

By:  Tupaki Desk   |   27 Aug 2020 9:15 AM IST
ఆ రీమేక్‌ లో చివరకు శ్రియ సెట్‌ అయ్యింది!
X
బాలీవుడ్‌ హిట్‌ మూవీ అంధాదున్‌ ను తెలుగులో నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను రంగ్‌ దే విడుదల అయిన వెంటనే పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు. హిందీ వర్షన్‌ లో ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్‌ పోషిస్తుండగా ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన టబు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయమై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.

నయనతార నుండి అనుష్క వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. యూనిట్‌ సభ్యులు నయన్‌ ను సంప్రదించగా భారీ పారితోషికంను ఆమె డిమాండ్‌ చేసింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆమెను సంప్రదించారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కాని తాజాగా శ్రియను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్‌ లో ఆమె పారితోషికం ఉండటంతో పాటు స్టార్‌ డం కూడా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను కన్ఫర్మ్‌ చేశారట. ఈ విషయంలో ఇంకా యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాలో నితిన్‌ అంధుడిగా కనిపించబోతున్నాడట.

నితిన్‌ సొంత బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందబోతున్నంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యిందట. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్‌ కు జోడీగా ప్రియాంక అరుల్‌ నటించబోతుందట. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.