Begin typing your search above and press return to search.

వాళ్ల హడావుడి అవ్వగానే నితిన్ రెడీ

By:  Tupaki Desk   |   29 Jan 2018 7:26 AM GMT
వాళ్ల హడావుడి అవ్వగానే నితిన్ రెడీ
X
పవన్ కళ్యాణ్ వీరాభిమాని - యంగ్ హీరో నితిన్ 25వ సినిమా కోసం ప్రస్తుతం చాలా మంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నితిన్ గత సినిమా లై ఊహించని విధంగా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న నితిన్ కు ఆ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే ఇప్పుడు ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలని నితిన్ 25వ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. పైగా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంత ప్రొడక్షన్ పికె క్రియేటివ్ వర్క్స్ లో మొదటికి సినిమా కాబట్టి మేఘ అభిమానుల సపోర్ట్ చాలానే ఉంటుంది. నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ కూడా సినిమా నిర్మాణంలో భాగం కానుంది. అయితే ఈ సినిమా మొదలైన సంగతి అందరికి తెలిసిందే. కానీ షూటింగ్ మాత్రం ఎప్పుడు ఎక్కడ జరిగిందో అనే విషయాలు మాత్రం బయటకి రాలేదు. రౌడీ ఫెలో దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. సమ్మర్ లో పెద్ద సినిమాల హడావుడి అయిపోగానే నితిన్ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఏప్రిల్ లేదా మే లో పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం. మొత్తానికి సినిమా షూటింగ్ అయితే చివరికి వచ్చేసింది. ఒక పాట అలాగే మరి కొన్ని సీన్లు అయిపోతే షూటింగ్ పూర్తవుతుంది. ఇక మరికొన్ని రోజుల్లో సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది.