Begin typing your search above and press return to search.

నితిన్ సినిమాకి బడ్జెట్ పెరుగుతోందా?

By:  Tupaki Desk   |   4 Nov 2015 10:30 PM GMT
నితిన్ సినిమాకి బడ్జెట్ పెరుగుతోందా?
X
త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా అ..ఆ.. శరవేగంగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టాప్ గేర్ లో ఉందని చెప్పాలి. స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేకపోవడంతో మధ్యలో దొరికిన టైంతో మీడియం రేంజ్ హీరో అయిన నితిన్ తో తీసేస్తున్నాడు మాటల మాంత్రికుడు. రీసెంట్ గా స్టార్ట్ అయిన అ..ఆ.. మరో మూడు నెలల్లో రిలీజ్ అయిపోతునుందంటే.. ఎంత స్పీడ్ గా పిక్చరైజ్ చేస్తున్నారో అర్ధమవుతుంది.

నిర్మాతలు ఈ మూవీపై పెడుతున్న ఖర్చు చూసి యూనిట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఓ బడా హీరోతో తీస్తున్నంత భారీగా హైబడ్జెట్ రూపొందిస్తున్నారట. ఓ సన్నివేశం కోసం ఏకంగా 50 కార్లు తెచ్చారంటే ఎంత గ్రాండ్ గా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారో అర్ధమవుతుంది. మహేష్ బాబుతోనో - పవన్ కళ్యాణ్ తోనో సినిమా తీస్తే ఎలా ఉంటుందో.. అ..ఆ.. ని కూడా అంత రిచ్ గా తీస్తుండడం విశేషం. అఫ్ కోర్స్.. నితిన్ తక్కువ రెమ్యూనరేషన్ కి యాక్సెప్ట్ చేశాడన్న మాటే తప్ప.. అసలు ఈ సినిమాని మీడియం బడ్జెట్ అనుకోవడానికి ఛాన్సే లేదని తేల్చేస్తున్నాయి యూనిట్ వర్గాలు. నితిన్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీగా అ..ఆ.. రికార్డ్ సృష్టించనుంది.

ఇకపోతే ప్రస్తుతం నితిన్‌ ఫోకస్ అంతా.. అఖిల్‌ రిలీజ్‌ మీదనే ఉంది. ఈ సినిమా కోసం చాలా డబ్బులే ఇనె్వస్టు చేశాడు మన కుర్ర హీరో.