Begin typing your search above and press return to search.
నితిన్ ఖాతాలో నాలుగు 100 మిలియన్లు!
By: Tupaki Desk | 4 May 2020 12:30 PM ISTసౌత్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు యూట్యూబ్ లో గత కొన్నేళ్ళుగా భారీ స్పందన దక్కుతోంది. అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. మన హీరోల మాస్ యాక్షన్ కు.. డ్యాన్సులకు.. కామెడీలకు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఆ సినిమాలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ఇలా తన హిందీ డబ్బింగ్ సినిమాలతో దుమ్ముదుమ్మారం రేపే హీరోల లిస్టులో నితిన్ కూడా చేరాడు.
నితిన్ నటించిన నాలుగు సినిమాలు 100 మిలియన్ల మార్క్ దాటడం విశేషం. 'LIE'.. 'ఛల్ మోహన్ రంగా'.. 'అ ఆ'.. 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలలో ఒక్కొక్క సినిమాకు 100 మిలియన్ల వ్యూస్ దాటి ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాల రైట్స్ ఆదిత్య మ్యూజిక్ వారి చేతిలో ఉన్నాయి. అయితే ఇలా కొన్ని సినిమాలు మిలియన్ల కొద్ది వ్యూస్ సహజంగా తెచ్చుకున్నవి కాదనే విమర్శలు కూడా ఉన్నాయి. కొందరు హీరోలు హిందీ మార్కెట్ పెంచుకోవడానికి భారీ వ్యూస్ కోసం రైట్స్ కొనుక్కున్న కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంటున్నారట. భారీ వ్యూస్ కోసం ఆ కంపెనీలు కొంత ఎమౌంట్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఎమౌంట్ ను తమ నెక్స్ట్ సినిమాల ఆడియో.. వీడియో రైట్స్ లో సర్దుబాటు చేసేలా తమ సినిమాల నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నారట.
ఈ 4 నితిన్ సినిమాల విషయంలో కూడా ఇలా జరిగి ఉంటుందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు కానీ ఆదిత్య లేబుల్ వారు మొదటి నుంచి క్రెడిబుల్ గా ఉంటారనే టాక్ ఉంది. అంతే కాకుండా నితిన్ కూడా స్వతహాగా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యడని అంటున్నారు. లాక్ డౌన్ సమయంలో దేశ ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి సినిమాల వ్యూస్ పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదని అంటున్నారు.