Begin typing your search above and press return to search.

తిన్నావా? అని అడిగిన నితిన్.. ఏంటా ఎర్ర‌బ‌స్సు లుక్కు?

By:  Tupaki Desk   |   13 Oct 2020 5:08 PM GMT
తిన్నావా? అని అడిగిన నితిన్.. ఏంటా ఎర్ర‌బ‌స్సు లుక్కు?
X
తెల్ల నెక్ బ‌నియ‌న్ పై ఎర్ర సూటు తొడిగాడు. అంతేనా.. ఆపై ప‌సుపు రంగు కార్ లో దొర‌బాబులా దిగాడు. ఆ కాళ్ల‌కు ఉన్న తెల్ల బ్రాండెడ్ షూస్ ని అదే ప‌నిగా చూస్తున్నాడు. అక్క‌డితో ఆగాడా? `తిన్నావా?` అని అడిగాడు. ఇంత‌కీ ఎవ‌రిని అడుగుతున్నాడు? అంటే .. ఆడియెన్ ని.. అభిమానుల్ని.

ఇదంతా దేని కోసం అంటే.. హీరో నితిన్ చాలా కాలం తర్వాత కొత్త బ్రాండ్ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌మోష‌న్ కి సంతకం చేశారు. దాని కోసం యాడ్ షూట్ చేసాడు. అతను దాని నుండి ఒక చిత్రాన్ని అభిమానుల‌కు షేర్ చేశాడు. అదే ఇది.

బ్రాండ్ సంగ‌తేమిటో చెప్ప‌కుండా దాచేసి నితిన్ దానికి “తిన్నావా?” అని శీర్షిక పెట్టాడు. ఎరుపు సూట్ - ఎరుపు ప్యాంటులో నితిన్ పూల‌రంగ‌డిలా క‌నిపిస్తున్నాడు. ప్రకటన షూట్ కోసం అతను తెల్లటి టీస్ తెలుపు బూట్లు ధరించాడు. బ్యాక్ గ్రౌండ్ కూడా రంగులమ‌యంగా ఉంది. వెంకీ అట్లూరి రొమాంటిక్ ఎంటర్ టైనర్ రంగ్ దే లో న‌టిస్తున్న నితిన్ త‌దుప‌రి కృష్ణ చైత‌న్య చిత్రంలోనూ న‌టించ‌నున్నాడు.