Begin typing your search above and press return to search.

హృతిక్ స్టెప్పుల తో నితిన్ వ్వావ్

By:  Tupaki Desk   |   27 Dec 2019 11:36 AM IST
హృతిక్ స్టెప్పుల తో నితిన్ వ్వావ్
X
ఇండియ‌న్ సూప‌ర్ హీరో హృతిక్ రోష‌న్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. ఆసియా ఖండం లోనే సెక్సీయెస్ట్ హీరోగా హృతిక్ రికార్డు ల గురించి.. మ‌గువ‌ల్లో అత‌డికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఇక మైండ్ బ్లోయింగ్ అనిపించే హృతిక్ స్టెప్పుల కు అటు కామ‌న్ జ‌నాలే కాదు సెల‌బ్రిటీ లు సినీస్టార్ల‌ లోనూ వీరాభిమానులెంద‌రో.

2019 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `వార్` సినిమా లో హృతిక్ న‌ట‌న.. డ్యాన్సుల‌కు ఫిదా కాని వారే లేరు. ఈ చిత్రంలో గుంగురూ పాట‌కు హృతిక్ మ‌తి చెడే స్టైలిష్ స్టెప్పులు వేశాడు. ఆ త‌ర్వాత ఆ స్టెప్పుల్ని ఎంద‌రో స్టార్లు ఇమ్మిటేట్ చేస్తూ ఆ డ్యాన్సుల‌ వీడియోల్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డం అవి కాస్తా ఫ్యాన్స్ లో వైర‌ల్ అయిపోవ‌డం తెలిసిందే.


వీడియో కోసం క్లిక్ చేయండి