Begin typing your search above and press return to search.

'మాచర్ల నియోజకవర్గం' లో బరిలో దిగుతున్న నితిన్..!

By:  Tupaki Desk   |   10 Sep 2021 12:43 PM GMT
మాచర్ల నియోజకవర్గం లో బరిలో దిగుతున్న నితిన్..!
X
యూత్‌ స్టార్ నితిన్ ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా తన 31వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ (ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గత కొంతకాలంగా పూర్తిగా క్లాస్ అండ్ సాఫ్ట్ రోల్స్ లో నటిస్తూ వస్తున్న నితిన్.. #Nithin31 లో యాక్షన్ ప్యాక్డ్ రోల్ పోషిస్తున్నాడు.

తాజాగా #Nithin31 మూవీకి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేసిన మేకర్స్.. మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి ''మాచర్ల నియోజకవర్గం'' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసారు. మోషన్ పోస్టర్ లో కొంతమంది రౌడీలు దాడి చేయడానికి కత్తులు గొడ్డలు పట్టుకొని వస్తుండగా.. అగ్ని జ్వాలాల మధ్య నితిన్ వారిని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నట్టు చూపించారు.

''మాచర్ల నియోజకవర్గం'' అనే మాస్ టైటిల్ మరియు మోషన్ పోస్టర్ లో హై యాక్షన్ ఎలిమెంట్స్‌ చూస్తుంటే.. ఈ సినిమా పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా ఉండబోతుందని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఈ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. దర్శకుడు ఎస్ఆర్ శేఖర్ ఇందులో నితిన్‌ ను ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ రోల్‌ లో ప్రెజెంట్ చేయబోతున్నారు.

దీని కోసం ఓ శక్తివంతమైన స్క్రిప్ట్‌ ను సిద్ధం చేసారని ''మాచర్ల నియోజకవర్గం'' టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ని బట్టి అర్థం అవుతుంది. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఇది నితిన్ హోమ్ ప్రొడక్షన్ లో వస్తున్న 7వ సినిమా. ఈ చిత్రంలో నితిన్ సరసన 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. ఇందులో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ భాగం కానున్నారు.

'భీష్మ' 'మాస్ట్రో' తర్వాత నితిన్‌ తో సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్‌ వర్క్ చేస్తున్న మూడవ చిత్రం ''మాచర్ల నియోజకవర్గం''. ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మామిడాల తిరుపతి ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.