Begin typing your search above and press return to search.

అఫిషియల్: హాట్ స్టార్ లో 'మాస్ట్రో'.. ట్రైలర్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   20 Aug 2021 12:25 PM IST
అఫిషియల్: హాట్ స్టార్ లో మాస్ట్రో.. ట్రైలర్ ఎప్పుడంటే..?
X
యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''మాస్ట్రో''. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా 'మాస్ట్రో' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

''మాస్ట్రో'' చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలానే ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన నితిన్ - తమన్నా - నభా నటేష్ ల పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ - టీజర్‌ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. 'మాస్ట్రో' మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అంధాదున్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందింది.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జె యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ న‌రేష్‌ - జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌ - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి - మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. నితిన్ కెరీర్లో 30వ సినిమాగా.. మొదటి ఓటీటీ రిలీజ్ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న 'మాస్ట్రో' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.