Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: నారీ నారీ న‌డుమ న‌లిగిపోయిన మాస్ట్

By:  Tupaki Desk   |   12 Sep 2021 11:50 AM GMT
వీడియో సాంగ్: నారీ నారీ న‌డుమ న‌లిగిపోయిన మాస్ట్
X
ట‌క్ జ‌గ‌దీష్ .. సీటీమార్ .. త‌లైవి చిత్రాలు విడుద‌ల‌య్యాయి. సెకండ్ వేవ్ త‌రవాత ధైర్యంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సినిమాల్లో సీటీమార్ .. త‌లైవి ఉన్నాయి.

కానీ ఇప్పుడు నితిన్ నటించిన `మాస్ట్రో` థియేట్రికల్ విడుద‌ల‌ను వ‌దులుకుని OTT ప్లాట్ ఫామ్ లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయ‌నుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ హిందీ మూవీ అంధాధున్ అధికారిక రీమేక్‌. తమన్నా భాటియా నెగెటివ్ పాత్రలో నటించ‌గా.. నభా నటేష్ నితిన్ ప్రియురాలిగా న‌టిస్తోంది. ఈ థ్రిల్లర్‌లో నితిన్ అంధుడిగా కనిపించ‌నున్నారు.

తాజాగా మాస్ట్రో నుంచి టైటిల్ సాంగ్ వీడియో విడుద‌లైంది. మ్యాస్ట్రో మ్యాస్ట్రో అంటూ సాగే ఈ పాట‌లో నితిన్ క్లాసీ స్టెప్పులు.. న‌భా న‌టేష్.. త‌మ‌న్నా మెరుపులు మైమ‌రిపిస్తున్నాయి. సురుక‌రో సురుక‌రో అంటూ ట్యూన్ ని ప్రారంభించి అంత‌కంత‌కు అదిరిపోయే స్టెప్పుల‌తో సెట్టింగుల‌తో హీట్ పెంచారు. ఒక ర‌కంగా మాస్ట్రో ఇద్ద‌రు అంద‌గ‌త్తెల న‌డుమ ఒక రేంజులో న‌లిగిపోయాడంటే నమ్మండి. మ‌ధ్య‌లో సీనియ‌ర్ న‌రేష్ పాత్ర‌ను ప్ర‌వేశ పెట్టారు పాట‌లో. ఓవ‌రాల్ గా సాంగ్ నితిన్ అభిమానుల‌కు విజువ‌ల్ ట్రీట్. అంధుడే అయినా స్టిక్ తో అద్భుతంగా స్టెప్పులేశారు. 17 సెప్టెంబ‌ర్ ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.