Begin typing your search above and press return to search.

సినిమా తేడా వ‌స్తే డైరెక్ట‌ర్ అడ్ర‌స్ చెబుతాడ‌ట‌

By:  Tupaki Desk   |   10 July 2022 3:15 AM GMT
సినిమా తేడా వ‌స్తే డైరెక్ట‌ర్ అడ్ర‌స్ చెబుతాడ‌ట‌
X
సినిమా తేడా వ‌స్తే వీడి డైరెక్ట‌ర్ అడ్ర‌స్ చెప్పేస్తా.. మీ అంద‌రికి.. అందరూ వీడి ఇంటికి వెళ్లిపోండి.. అంటూ హీరో నితిన్ షాకిచ్చాడు. వివ‌రాల్లోకి వెళితే.. క్రేజీ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం`. ఈ మూవీ ద్వారా ఎడిట‌ర్ ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న బాలీవుడ్ రీమేక్ `మాస్ట్రో` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో హీరో నితిన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవాల‌న్న క‌సితో చేస్తున్న సినిమా ఇది.

ప‌వ‌ర్ ఫుల్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో నితిన్ క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. గ‌త చిత్రాల‌కు మించి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో నితిన్ న‌టిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ కోసం షాకింగ్ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ తో స‌రికొత్త మేకోవ‌ర్ లోకి మారిపోయారు. ఫ‌స్ట్ లుక్ నుంచే ఎట్రాక్ట్ చేయ‌డం మొద‌లు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ఫ‌స్ట్ ఎటాక్ అంటూ రిలీజ్ చేసిన టీజ‌ర్ తో అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచేసింది.

భారీ స్థాయిలో ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేశారు. ఇప్ప‌టికే చిల్ మారో అంటూ తొలి లిరికల్ వీడియోని విడుద‌ల చేసిన మేక‌ర్స్ శనివారం `రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ.. ` అంటూ సాగే స్పెష‌ల్ ఐట‌మ్ నంబ‌ర్ కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. అంజ‌లి, నితిన్ ల‌పై మాసీవ్ జాత‌ర సాంగ్ గా ఈ పాట‌ని చిత్రీక‌రించారు. జానీ మాస్ట‌ర్ కంపో.జ్ చేసిన‌ ఊర మాస్ స్టెప్పుల‌ని నితిన్ -అంజ‌లి పోటీప‌డి అద‌ర‌గొట్టేశారు.

ఈ లిరిక‌ల్ వీడియో రిలీజ్ సంద‌ర్భంగా హీరో నితిన్ ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై స‌ర‌దాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన నితిన్ ద‌ర్శ‌కుడిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మీ ప్ర‌తీ ట్వీట్ చూస్తూనే వుంటాన‌ని, ట్వీట్ల‌ల్లో డ్యాన్స్ చేయండన్నా..డ్యాన్స్ చేయండన్నా అని చావ‌గొడుతుంటరు న‌న్ను. మీ కోస‌మే ఈ సినిమాలో టు హై డాన్స్ నంబ‌ర్స్ పెట్టాము. ఇప్ప‌డు రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియోలో డాన్స్ త‌క్కువ‌గా వుంది. కానీ ఫుల్ సాంగ్ లో మాత్రం ఇంకా ఎక్కువ‌గా వుంటుంది. జానీ మాస్ట‌ర్ తో ఫ‌స్ట్ టైమ్ చేస్తున్నా.. బాగుంటుందా? బాగుండ‌దా? అని అనుకుంటుండ‌గానే సాంగ్ మంచి హిట్ అయిపోయింది.

శేక‌ర్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సో.. ఈ సినిమా తేడా వ‌స్తే వీడి అడ్ర‌స్ చెప్తా మీ అంద‌రికి.. మీ అంద‌రూ వీడి ఇంటికి వెళ్లిపోండి..అంటూ డైరెక్ట‌ర్ ని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు. నితిన్ ఆ మాట‌లు అంటుంటే ద‌ర్శ‌కుడు ముందు కొంత టెన్ష‌న్ ప‌డినా ఆ త‌రువాత న‌వ్వేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది.