Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్ నుంచి లాక‌ప్ ‌కి చెక్‌

By:  Tupaki Desk   |   16 Oct 2020 12:45 PM IST
లాక్‌ డౌన్ నుంచి లాక‌ప్ ‌కి చెక్‌
X
నితిన్ వ‌రుస సినిమాల‌తో స్పీడు పెంచారు. ఇటీవ‌లే వివాహం చేసుకున్న నితిన్ సినిమా విష‌యంలో స్పీడు పెంచేశాడు. త‌ను న‌టిస్తున్న ‘రంగ్ దే’ మూవీ టాకీ పార్ట్‌ని పూర్తి చేశాడు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ న‌టిస్తోంది. పీసీ శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న ఈ మూవీ పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

దీంతో నితిన్ త‌న త‌దుప‌రి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం `చెక్‌`. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఫ‌స్ట్ లుక్ ని గ‌త రెండు వారాల క్రితం చిత్ర బృందం రిలీజ్ చేసింది. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌,... ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. నితిన్ సెట్స్‌లోక ఎంట‌ర‌య్యారు. తన సోషల్ మీడియా అకౌంట్‌ లలో ‘లాక్‌ డౌన్ టు లాకప్’ అనే ఒక పోస్టర్‌ ను పంచుకున్నాడు.

ఇందులో నితిన్ ఖైదీగా కనిపిస్తున్నాడు అతని పాత్ర చుట్టూ ఈ చిత్ర క‌థ ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగనుంది. వింక్ లేడీ నితిన్ ప్రేయ‌సిగా క‌నిపిస్తుండ‌గా ర‌కుల్ న్యాయ‌వాదిగా నితిన్ ‌ని కాపాడేందుకు ఫైట్ చేసే యువ‌తిగా క‌నిపించ‌బోతోంది.