Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ చెల్లి రీ ఎంట్రీ ప్రయత్నాలు

By:  Tupaki Desk   |   16 Aug 2021 4:01 AM GMT
స్టార్‌ హీరోయిన్‌ చెల్లి రీ ఎంట్రీ ప్రయత్నాలు
X
సినిమా ఇండస్ట్రీలో వారసుల జాబిత తీస్తే చాంతాడంత అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ జాబితాలో హీరోయిన్స్‌ వారసులు కాస్త తక్కువగా ఉంటారనే చెప్పాలి. హీరోయిన్స్ వారి పిల్లలను పరిచయం చేయడం చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది. కొందరు తమ చెల్లెల్లను తీసుకు వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు హీరోయిన్స్ సిస్టర్స్ సినీ రంగ ప్రవేశం చేసి సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. టాలీవుడ్‌ చందమామ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. కాజల్‌ చెల్లి అవ్వడం వల్ల ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. కాని అదృష్టం కలిసి రాలేదు.

నిషా అగర్వాల్‌ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో మెల్లగా ఆమెకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. పైగా ఆమె హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో ఎక్స్ పోజ్‌ చేయలేక పోతుందని కూడా కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి నిషా అగర్వాల్‌ సినిమాలకు దూరం అయ్యింది. ఒక వైపు అక్క స్టార్ గా దూసుకు పోతుండగా నిషా మాత్రం సినిమా లు లేక పోవడంతో పెళ్లికి సిద్దం అయ్యింది. పెళ్లి చేసుకున్న నిషా అగర్వాల్‌ బాబుకు జన్మను ఇచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్స్ కు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వరు అనే టాక్ ఉంది. కాని ఈమద్య కాలంలో ఓటీటీ ల వల్ల ప్రతి ఒక్కరికి ఆఫర్లు దక్కుతున్నాయి.

కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్‌ కూడా ఓటీటీ కంటెంట్‌ తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. పెళ్లి అయ్యి బాబుకు జన్మనిచ్చినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. కనుక ఓటీటీలో సక్సెస్ అయితే ఫీచర్ ఫిల్మ్‌ లో కూడా యంగ్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఆమె నటిగా తనను తాను నిరూపించుకునేందుకు వెబ్‌ సిరీస్ లో నటించేందుకు సిద్దం అవుతుందట. రానా మరియు వెంకటేష్‌ లు కలిసి నటించబోతున్న వెబ్‌ సిరీస్ లోని కీలక పాత్రకు గాను ఈమెను ఎంపిక చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తుంది. ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి. మొత్తానికి త్వరలోనే ఈ అమ్మడు ఓ వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. కాజల్‌ అగర్వాల్‌ చెల్లి కనుక నిషా అగర్వాల్‌ కు ఇప్పటికి మంచి పేరు ఉంది. కనుక ఈమె వెబ్‌ సిరీస్ మంచి సక్సెస్‌ అయితే హీరోయిన్‌ గా వరుసగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.