Begin typing your search above and press return to search.

అమ్మ పాత్రలో నిషా కళ్ల నిరోషా

By:  Tupaki Desk   |   24 Jun 2017 12:52 PM GMT
అమ్మ పాత్రలో నిషా కళ్ల నిరోషా
X
గత తరం అందాల భామ నిరోషాకు.. నిషా కళ్ల హీరోయిన్ అనే గుర్తింపు ఉండేది. ఆమె కళ్లలో ఉండే మత్తుకే అభిమానులు సగం ఫ్లాట్ అయిపోయేవారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి మెల్లగా తప్పుకున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేమ్ సుధాకర్ హీరోగా నటిస్తున్న 'నువ్వు తోపురా' అనే మూవీలో నటిస్తోంది సీనియర్ నటి నిరోషా. ఇప్పుడు గత తరం హీరోయిన్లను అమ్మ పాత్రల్లో ఇంట్రడ్యూస్ చేసే ట్రెండ్ బాగానే నడుస్తుండగా.. నిరోషా కూడా అమ్మ రోల్ లోకి వచ్చేసిందని అనుకోవచ్చు. అయితే.. కొంత కాలంగా ఈమెతో రీఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. నువ్వు తోపురా చిత్రంలో ఆఫర్ చేసిన కేరక్టర్ నచ్చడంతోనే ఆమె ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. హీరోకు అమ్మ పాత్రలో నటించడమే కాదు.. ఈమెది మూవీలో హీరోను నడిపించే కీలకమైన రోల్ అని తెలుస్తోంది.

నిరోషా చేస్తున్న పాత్ర పేరు సావిత్రి అని.. సినిమాకి ఆమె రోల్ కీలకంగా నిలుస్తుందని నిర్మాత శ్రీకాంత్ చెబుతున్నారు. హరినాథ్ బాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలలో.. నిత్యాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నిరోషా రీఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో టాలీవుడ్ జనాలు కూడా ఈ చిత్రాన్ని ఆసక్తిగా పరిశీలిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/