Begin typing your search above and press return to search.

కొత్త పిల్లాడు వర్సెస్ సీరియల్స్ కుర్రాడు

By:  Tupaki Desk   |   15 Sep 2016 5:30 PM GMT
కొత్త పిల్లాడు వర్సెస్ సీరియల్స్ కుర్రాడు
X
ఈ శుక్రవారం కూడా బాక్సాఫీస్ ను గడగడలాడించేంత పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. ఎలాగో నాని మజ్ఞూ సినిమా 23న వస్తోంది కాబట్టి.. అప్పటివరకు చిన్న సినిమాలకు కొన్నింటికి అవకాశం కలిసొస్తుంది. అది వినియోగించుకోవడానికి ఓ నలుగురు బరిలోకి దిగుతుంటే.. అందులో ముఖ్యంగా పెద్దల సపోర్టుతో వస్తున్న ఒక కొత్త పిల్లాడు.. అలాగే బుల్లితెరపై వరల్డ్ ఫేమస్ అయిన ఒక సీరియల్స్ కుర్రాడు వస్తున్నారు.

రేపటి రిలీజుల్లో నాగార్జున గెస్ట్ రోల్ చేసిన ''నిర్మాలా కాన్వెంట్'' ఒక పెద్ద రిలీజ్ అనే చెప్పాలి. సినిమాకు కాసినన్ని ఎక్కువ ధియేటర్లే దక్కాయి. దానికితోడు శ్రీకాంత్ కొడుకు రోషన్ తొలిసారిగా హీరోగా కనిపిస్తున్నాడు అనగానే కొందరి సినిమా అభిమానుల్లో సాధారణంగానే ఒక హైప్ అనేది ఉంటుంది. అలాగే చైల్డ్ స్టార్ శ్రీయ శర్మ కూడా కాస్త హాటుగా కనిపిస్తుండటంతో.. అది కూడా ఒక యాడెడ్ ఎట్రాక్షన్ అయిపోయింది.

ఈ సినిమాకు పోటీ ఇస్తోంది ఎవరు అంటే.. ''సిద్దార్ధ'' అనే సినిమానే అని చెప్పాలి. బుల్లితెరపై హీరోగా విలన్ గా ఒక దమ్మున్న యాక్టర్ గా పాపులర్ అయిన సాగర్ ఈ సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. సినిమాకు ఒక మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా తీశారని మనకు ట్రైలర్లు - పాటల వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. మనోడికి కూడా నిర్మాతల నుండి పంపిణీదారుల వరకు చాలామంది అండ ఉండటంతో.. సినిమాను గ్రాండ్ గానే రిలీజ్ చేస్తున్నారు.

చూద్దాం మరి.. ఈ కొత్త పిల్లాడు అండ్ సీరియల్స్ కుర్రాడులో ఎవరు గాట్టిగా కొడతారో. ఇద్దరూ హిట్టవ్వాలని ఆశిద్దాం.