Begin typing your search above and press return to search.

జూన్ 17.. వెయిటింగ్ వెయిటింగ్

By:  Tupaki Desk   |   16 Jun 2017 4:15 PM GMT
జూన్ 17.. వెయిటింగ్ వెయిటింగ్
X
మామూలుగా మ‌న సినీ ప్రేక్ష‌కులు శుక్ర‌వారం కోసం ఎదురుచూస్తుంటారు. ఐతే ఈ వారాంతంలో శుక్ర‌వారం కంటే శ‌నివారం ఎక్కువ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. జూన్ 17వ తేదీలో ఏం ప్ర‌త్యేక‌త ఉందో ఏమో కానీ.. ఈ రోజు మూడు ఇంట్రెస్టింగ్ మూవీస్ నుంచి ప్రేక్ష‌కుల‌కు కానుక‌లు అంద‌బోతున్నాయి. అందులో ముందు చెప్పుకోవాల్సింది నాని సినిమా ‘నిన్ను కోరి’ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ గురించే. వారం కింద‌ట మాంచి ఫీల్ గుడ్ టీజ‌ర్ తో ఆస‌క్తి రేకెత్తించిన ‘నిన్ను కోరి’ టీం.. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు ట్రైల‌ర్ లాంచ్ చేస్తోంది.

మ‌రోవైపు నారా రోహిత్ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు మ‌హేష్ సూర‌ప‌నేని తెర‌కెక్కిస్తున్న ‘క‌థ‌లో రాజ‌కుమారి’ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా శ‌నివార‌మే విడుద‌ల‌వుతుంది. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుంది. ఆ మ‌ధ్య వ‌చ్చిన ‘క‌థ‌లో రాజ‌కుమారి’ టీజ‌ర్ జ‌నాల్లో క్యూరియాసిటీ పెంచింది. ట్రైల‌ర్ ఎలా ఉంటుందా అన్న ఆస‌క్తి జ‌నాల్లో ఉంది. ఇక చాలా గ్యాప్ త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టి ‘ఫిదా’ సినిమా తీస్తున్న శేఖ‌ర్ క‌మ్ముల ఇప్ప‌టిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషాన్నీ పంచుకోలేదు. ‘ఫిదా’ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ శ‌నివారమే లాంచ్ చేయ‌నున్నారు. మ‌రి ఈ టీజ‌ర్లో శేఖ‌ర్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌డం.. వ‌రుణ్ తేజ్ తో ప్రేమ‌మ్ భామ సాయిప‌ల్ల‌వి జ‌త క‌ట్ట‌డం ఆస‌క్తి రేకెత్తించే అంశాలే. మ‌రి శ‌నివారం విడుద‌ల‌య్యే టీజ‌ర్.. ట్రైల‌ర్ల‌లో ఏవి ఏ మేర‌కు ఆకట్టుకుంటాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/