Begin typing your search above and press return to search.

నిన్నే నిన్నే: లవ్ సాంగ్ తో వచ్చిన 'అశ్వథ్థామ'

By:  Tupaki Desk   |   19 Dec 2019 1:38 PM GMT
నిన్నే నిన్నే: లవ్ సాంగ్ తో వచ్చిన అశ్వథ్థామ
X
యువ హీరో నాగ శౌర్య త్వరలో 'అశ్వథ్థామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నూతన దర్శకుడు రమణ తేజ రూపొందిస్తున్న ఈ సినిమాను శౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. రిలీజ్ కు రెండు నెలలు కూడా లేకపోవడంతో ప్రచారకార్యక్రమాలలో జోరు పెంచారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈ సినిమా నుండి 'నిన్నే నిన్నే' అంటూ సాగే మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. ఈ పాటకు సాహిత్యం అందించినవారు రమేష్ వాకచర్ల. అర్మాన్ మాలిక్.. యామిని ఘంటసాల ఈ పాటను పాడారు. "నిన్నే నిన్నే యదలో నిన్నే చెలియా నీకై నేనే వేచానులే అలుపే రాదే అదుపే లేదే. అయినా సమయం సరిపోదులే.. " అంటూ మంచి రొమాంటిక్ ఫీల్ తో హీరో పాడే పాట ఇది. మధ్యలో కొన్ని బిట్స్ లో మాత్రం హీరోయిన్ అందుకుంటుంది. లిరిక్స్ సింపుల్ గా ఉన్నప్పటికీ ఎంతో అందంగా క్యాచీగా ఉన్నాయి. శ్రీచరణ్ ఈ పాటకు మంచి ఫీల్ ఉండే ఎనర్జిటిక్ ట్యూన్ అందించారు. అర్మాన్ మాలిక్.. యామిని ఘంటసాల ఈ పాటను చక్కగా పాడారు. నాగశౌర్య- మెహ్రీన్ ల జోడీ ఒక అందమైన కూల్ హిల్ స్టేషన్లో రొమాన్స్ చేస్తున్న విజువల్స్ అందంగా ఉన్నాయి.

'అశ్వథ్థామ' ఆడియోకు ఈ పాట మంచి బోణీ అనే చెప్పాలి. రొమాంటిక్ సాంగ్ కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువే. 'అశ్వథ్థామ' లో మిగతా పాటలు.. టీజర్ రిలీజ్ అయ్యేలోపు ఈ 'నిన్నే నిన్నే' ను వినేయండి.