Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో నైన్ బ్యూటీస్

By:  Tupaki Desk   |   6 Dec 2018 10:09 AM IST
ఎన్టీఆర్ తో నైన్ బ్యూటీస్
X
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి బయోపిక్ గానే కాక వివిధ రకాల అంశాల్లో కూడా ఎన్టీఆర్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇందులో నిన్నటి తరం హీరోయిన్ల పాత్రల్లో నటిస్తున్న బ్యూటీస్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. తెర మీద పాత సూపర్ హిట్ పాటలకు బాలయ్యతో కలిసి వీళ్ళు స్టెప్స్ వేస్తే చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముందుగా సెలెక్ట్ అయిన విద్యా బాలన్ లుక్ ఇంకా బయటకు రాలేదు. బసవతారకం గారి పాత్ర పోషించిన విద్యా బాలన్ కు స్క్రీన్ స్పేస్ బాగానే దక్కినట్టు సమాచారం. ఇక మిగిలిన వాళ్లంతా క్యామియోలే అయినప్పటి కీ కనిపించే ఆ కాసేపు ఈలలు గోలలు ఖాయమని యూనిట్ టాక్.

గుండమ్మ కథ లో సావిత్రి లుక్ తో ఇప్పటికే నిత్యా మీనన్ పాస్ మార్కులు కొట్టేసింది. కీర్త్ సురేష్ రేంజ్ లో కాకపోయినా లెన్త్ తక్కువ కాబట్టి పెద్ద సమస్య కాబోదు. ఇక స్వీటీ అనుష్క ఇందులో సరోజాదేవి గా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే షావుకారు జానకి గా మెరవనున్నట్టు తెలిసింది. ఈ లుక్స్ సీక్రెట్ గా ఉంచారు. ఇక శ్రీదేవి గా రకుల్ ప్రీత్ సింగ్ వేటగాడు పాట లో ఆకుచాటు పిందె తడిసె స్టిల్ లో అందాలు ఆరబోయడం ఇప్పటికీ ఆకట్టుకుంది. వీళ్ళు కాకుండా జయప్రదగా హన్సిక -జయసుధ గా మాళవిక నాయర్-కృష్ణ కుమారిగా పాయల్ రాజ్ పుత్ మాంచి కలర్ ఫుల్ సందడి చేయబోతున్నారు.

ఇంకా సర్ప్రైజ్ ఇచ్చే అంశాలు హీరోయిన్లు ఉన్నారని తెలుస్తోంది కానీ లీక్ కాకుండా యూనిట్ జాగ్రత్త పడుతోంది. ఇందులో అనుష్క తప్ప దాదాపు అందరు బాలకృష్ణ పక్కన మొదటి సారి కనిపిస్తున్న వారే. బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలా ఇందరేసి ముద్దుగుమ్మలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఫ్యాన్స్ కి ఇంత కంటే కావలసింది ఏముంది