Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ్యాగజన్లో రచ్చ చేస్తోందిగా

By:  Tupaki Desk   |   1 Feb 2016 3:30 PM GMT
ఫోటో స్టోరి: మ్యాగజన్లో రచ్చ చేస్తోందిగా
X
హీరోయిన్లకు సినిమాల్లో రోల్స్ ఒక ఎత్తు, ఒరిజినల్ కేరక్టర్ మరొక ఎత్తు, ఫోటో షూట్స్ లో చూపించే అందాలు మరో ఎత్తు అని చెప్పాలి. లంచ్ బాక్స్ - ఎయిర్ లిఫ్ట్ సినిమాలతో మంచి కేరక్టర్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నిమ్రత్ కౌర్. రెండు సినిమాల్లోనూ పెర్ఫామెన్స్ పరంగా బోలెడు మార్కులు పడ్డాయి. యాక్టింగ్ లో ఈ భామ ట్యాలెంట్ చూసి చాలామంది సీనియర్లు కూడా నోరెళ్లబెట్టారు. కానీ ఈ సుందరాంగి ఇప్పుడు అల్ట్రామోడర్న్ గ్లామర్ డాళ్ అవతారం ఎత్తేసింది.

ఎఫ్‌హెచ్ఎం మేగజైన్ కవర్ పేజ్ పై నిమ్రత్ రూపం చూసి, అందరూ నోరెళ్లబెట్టేశారు. బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని, రెడ్ బ్రా మాత్రమే వేసుకుని కసెక్కించే చూపులతో పోజిచ్చింది నిమ్రత్ కౌర్. అమ్మడిని బ్లాక్ అండ్ వైట్ లో చూపుతూ, అలంకారాలను మాత్రం కలర్ లో చూపించిన ఫోటో బాగా అట్రాక్టివ్ గా ఉంది. ఇప్పటివరకూ డీ గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ సుందరాంగి.. ఇంత సెక్సీగా దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ కి షాక్ తగిలింది.

డీగ్లామర్ రోల్స్ చేసిన రెండు సినిమాలు హిట్ అవడంతో.. నిమ్రత్ కి అలాంటి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కానీ తనలో ఉన్న గ్లామర్ యాంగిల్ ని కూడా చూడమంటూ.. ఇలా సెక్సీ ఫోటోలతో చెబుతోందంటున్నారు బాలీవుడ్ జనాలు. ఏమైనా ఈమెలో ఎప్పుడూ కనిపించని కొత్త కోణాన్ని చూసేసరికి.. అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నారు.