Begin typing your search above and press return to search.

బికినీలో బ్యూటీ చూపిస్తున్న ఆంటీ

By:  Tupaki Desk   |   21 Jun 2016 6:42 AM GMT
బికినీలో బ్యూటీ చూపిస్తున్న ఆంటీ
X
34 ఏళ్ల వయసంటే ఓ రకంగా ఆంటీ అనాల్సిందే. యంగేజ్ నుంచి కెరీర్ ని పీక్ స్టేజ్ లో కంటిన్యూ చేస్తున్న హీరోయిన్స్ తప్పితే.. మిగతా వారందరూ ఈ టైం కల్లా ఆంటీ టైపు కేరక్టర్లకు మారిపోతుంటారు. బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ కూడా అంతే. పైగా లంచ్ బాక్స్ మూవీలో ఆంటీ గెటప్ లో కనిపించడంతో.. అదే టైపులో ఫిక్స్ అయిపోయారు జనాలు.

రీసెంట్ గా వచ్చిన ఎయిర్ లిఫ్ట్ లో ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో మెప్పించడంతో.. నిమ్రత్ కు క్రేజ్ బాగానే ఉంది. ఇప్పుడీ ఎన్నారై భామ.. వెకేషన్ లో ఉంది. మాంచి లొకేషన్స్ చూసుకుని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేస్తోంది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం పెద్ద విశేషమేమీ కాదు కానీ.. అక్కడ తన ఆనందాన్ని ఫోటోలు తీసి నెట్ లో పెట్టేసింది. టూ పీస్ బికినీ లో ఐస్ కోల్డ్ వాటర్ లో స్విమ్మింగ్ చేసేసింది నిమ్రత్ కౌర్.

సినిమాల్లో ఆంటీ టైపు కేరక్టర్లలో కనిపించిన నిమ్రత్.. రియల్ లైఫ్ లో ఈ రేంజ్ ఎంజాయ్ మెంట్ చూసేసరికి చాలామందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. గ్రీనరీ ఏరియాలో.. అతి చల్లగా ఉండే వాటర్ లో అంత పొట్టి దుస్తులతో ఈత కొడితే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ.. ఈ సుందరాంగి ఆనందాన్ని మాత్రం చూసి తరించొచ్చు.