Begin typing your search above and press return to search.

స్టిక్ తో న‌డుస్తూ ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ తంటాలు

By:  Tupaki Desk   |   29 Oct 2021 10:30 AM GMT
స్టిక్ తో న‌డుస్తూ ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ తంటాలు
X
అందాల క‌థానాయిక నిమ్రత్ కౌర్ కాలికి బ‌ల‌మైన గాయ‌మైంది. ఎడ‌మ కాలు గాయం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. కాలి పాదం నుంచి మోకాలి వ‌రకూ సిమెంట్ ప‌ట్టీ వేసిన‌ట్లు క‌నిపిస్తోంది. దానివ‌ల్ల‌ ఎయిర్ పోర్ట్ లో వాకింగ్ స్టిక్ స‌హాయంతో న‌డుస్తున్నప్ప‌టి ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి ఈ గాయం ఎలా అయింది? అంటే.. అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

త‌న కాలి గాయం గురించి ఎయిర్ పోర్టులో మీడియా ప్ర‌శ్నించ‌గా వ్యాయామం చేస్తుండ‌గా దెబ్బ త‌గిలిన‌ట్లు తెలిపింది. అంత‌కు మించి ఎక్కువ వివ‌రాలు ఇవ్వ‌డానికి నిమ్ర‌త్ ఇష్ట‌ప‌డ‌లేదు. ఈ పిక్ వైర‌ల్ గా మార‌డంతో ఆమె అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఇక నిమ్రత కౌర్ సినిమా ల విష‌యానికి వ‌స్తే `య‌హాన్` చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అటుపై `ఒన్ నైట్ విత్ ద కింగ్`...` ఎన్ కౌంట‌ర్` లాంటి చిత్రాల్లో న‌టించింది. అయితే ఆ చిత్రాలేవి అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు ని తీసుకురాలేదు. ఆ త‌ర్వాత న‌టించిన `లంచ్ బాక్స్` సినిమాతో దేశ వ్యాప్తంగా ఫేమ‌స్ అయింది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్శియ‌ల్ గాను పెద్ద స‌క్సెస్ అయింది. అవార్డులు..రివార్డులు సైతం కొల్ల‌గొట్టింది. ఆ త‌ర్వాత `ఎయిర్ లిఫ్ట్` లాంటి చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం `ద‌స్వీ` సినిమాలో న‌టిస్తోంది. ఇందులో అభిషేక్ బ‌చ్చ‌న్ తో కలిసి న‌టిస్తోంది.

దాదాపు ఐదేళ్లు గ్యాప్ త‌ర్వాత చేస్తోన్న సినిమా. దీంతో ఈ సినిమాపై అమ్మ‌డు ఆశ‌లు భారీగానే పెట్టుకుంది. అక్ష‌య్ తో ఎయిర్ లిప్ట్ త‌ర్వాత వెండి తెర‌కు దూర‌మైంది. `ద‌స్వీ` తో నిరూపించుకోవాల్సిన టైమ్ వ‌చ్చిందిప్పుడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. అలాగే ప‌లు టీవీ షోస్ లోనూ నిమ్ర‌త్ క‌నిపించింది. మ్యూజిక్ వీడియోస్..కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా న‌టించింది. కానీ అక్క‌డ అంత‌గా ఫేమ‌స్ కాలేదు.