Begin typing your search above and press return to search.

మంచం పక్కనే అమ్మడి అందాల చితక్కొట్టుడు..!

By:  Tupaki Desk   |   4 May 2020 9:10 AM GMT
మంచం పక్కనే అమ్మడి అందాల చితక్కొట్టుడు..!
X
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ నిక్కీ తంబోలి. మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుని తన గ్లామర్ తో యూత్ ని ఆకట్టుకుంది అమ్మడు. ఈ హర్రర్ బేస్డ్ కామెడీ సినిమాకి నిక్కీ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత శ్రీ విష్ణుతో తిప్పరా మీసం సినిమాలోనూ నిక్కీ తంబోలి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై అంచనాలు బాగానే పెట్టుకుంది. కానీ సినిమా అనుకున్నట్లుగా ఆడలేదు. ఆ తర్వాత గ్లామర్‌ తో పాటు నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలనే ఎంచుకుంటాననీ, అడల్ట్‌ కామెడీ తరహా సినిమాలు చేయబోననీ నిక్కీ చెప్పింది. తర్వాత కాంచన3 సినిమాలో నటించింది. కాంచన3 సినిమా మంచి విజయం సాధించడంతో నిక్కీకి అవకాశాలు క్యూ కట్టాయి. తమిళంతో పాటు బాలీవుడ్ లోను ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

నిక్కీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' బి-గ్రేడ్‌ అడల్ట్‌ కామెడీ మూవీలో నటించి, కెరీర్‌ మీద పెద్ద మచ్చ వేసేసుకుంది నిక్కీ తంబోలీ. ఆ మచ్చ చెరిపేసుకోవడానికి ఇప్పుడు నానా పాట్లూ పడుతోందట. 'కొన్ని సినిమాలు తేడా కొడతాయి. ఇది అంతే.. అందులో నటించినందుకు మరీ అంత బాధపటంలేదు.. కానీ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అన్పిస్తుంటుంది' అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. అయితే ఈ బ్యూటీలోని అసలు టాలెంట్ బయటపడాలంటే మరో రెండు, మూడు యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు చేయాల్సిందే. అయితే ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో అభిమానులను వేడెక్కించే ఫొటోలు పోస్ట్ చేస్తూ అదరగొడుతుంది. తాజాగా నిక్కీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. గులాబీ రంగు డ్రెస్ ధరించి కాళ్ళు రెండు వెనక్కి మడిచి కూర్చుంది. ఈ ఫొటోలో నిక్కీ అందాలు యూత్ కి మతులు పోగొడుతున్నాయి. పక్కనే బెడ్.. ఎదురుగా అమ్మడి అందాల విందు.. చూసి యూత్ ఫిదా అవుతున్నారు.