Begin typing your search above and press return to search.

బెడ్ రూమ్ లో చిత‌క్కొడుతున్న తంబోలి

By:  Tupaki Desk   |   7 March 2021 4:30 PM GMT
బెడ్ రూమ్ లో చిత‌క్కొడుతున్న తంబోలి
X
చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు చిత్రంతో తెలుగు నాట యూత్ కి బాగా క‌నెక్ట‌యిపోయింది నిక్కీ తంబోలి. అంతకుముందు లారెన్స్ తెర‌కెక్కించిన హార‌ర్ చిత్రం కాంచ‌న‌3లోనూ న‌టించింది ఈ బ్యూటీ. బోల్డ్ అప్పియ‌రెన్స్ వేడెక్కించే శృంగార స‌న్నివేశాల‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపే ఈ భామ‌కు అటు హిందీ బుల్లితెర‌పైనా ఇటీవ‌ల క్రేజు పెరిగింది.

స‌ల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ లేటెస్ట్ సీజ‌న్ లో నిక్కీ తంబోలి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. చివ‌రి వ‌ర‌కూ ఇంటి స‌భ్యురాలిగా కొన‌సాగి ఫేవ‌రెట్ గా మారిన నిక్కీ అనూహ్యంగా షోనుంచి వైదొల‌గ‌డం అభిమానుల్ని నిరాశ‌ప‌రిచింది. అయితేనేం.. గేమ్ లో గొప్ప మేధోత‌నం తో పాటు అందం చందంతోనూ నిక్కీ క‌ట్టి ప‌డేసింది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి బాలీవుడ్ లో వ‌రుస పెట్టి ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయ‌ట‌. కానీ ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే అన్న కందంగా.. తానే ఆచితూచి అడుగులేస్తోందిట‌. నిక్కీ ఈ క్రేజును నిల‌బెట్టుకునేందుకు సోష‌ల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. తాజాగా ఈ భామ బెడ్ రూమ్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో మంట‌లు పెడుతోంది. నిక్కీ ఎద అందాల్ని ఎలివేట్ చేసే గ‌మ్మ‌త్త‌యిన ఫోటో ఇది. పింక్ లో చిత‌క్కొడుతోంది ఈ భామ‌! అంటూ కుర్ర‌కారు కామెంట్ల‌తో వెర్రెక్కి మ‌రీ వెబ్ లో షేర్ చేస్తున్నారు.