Begin typing your search above and press return to search.

నిక్కీ తంబోలి స్థాయిని పెంచుతోంది

By:  Tupaki Desk   |   21 Nov 2021 5:00 AM GMT
నిక్కీ తంబోలి స్థాయిని పెంచుతోంది
X
బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు సినిమాతో తెలుగు యువ‌త‌కు మైండ్ బ్లాక్ చేసిన ఈ బ్యూటీ రాఘ‌వ లారెన్స్ `కాంచ‌న 3`లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఫియర్ ఫ్యాక్టర్: కాట్రోన్ కే ఖిలాడి` టీవీ షోలో కూడా నటించింది.

ఇటీవ‌ల హిందీలో బిగ్ బాస్ 15 పార్టిసిపేషన్ తో మరింత ప్రజాదరణ పొందింది. ఈ బ్యూటీ వేడెక్కించే స్కిల్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌రం లేదు. ఫోటోషూట్ల‌లోనూ అద్భుతంగా ఎలా కనిపించాలో తెలుసు. తాజాగా మ‌రోసారి బోల్డ్ లుక్ తో హీటెక్కించింది నిక్కీ.

ఫిట్ లుక్ మ్యాగజైన్ కోసం నిక్కీ తంబోలి నియాన్ సూట్ లో పోజులిచ్చింది. బ‌ట‌న్ లెస్ సూట్ లో క్లీవేజ్ షోను ప్రదర్శిస్తూ నిక్కీ ఘాటైన ఫోజుల‌తో చెల‌రేగింది. మ్యాగజైన్ కవర్ పై ఉన్న క్యాప్షన్ లో నిక్కీ గురించి `రైజింగ్ ది బార్` అని ఉంది. లేటెస్ట్ బోల్డ్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని చిద్రం చేస్తోంది ఈ బ్యూటీ.

``ఆదరణ పొందడం నా తప్పు కాదు.. మీరు అసూయపడితే నా తప్పు కాదు`` అని క్యాప్షన్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. చీక‌ట్లోనే కాదు వెలుతురులోనూ దంచి కొట్టుడే! అంటూ బోయ్స్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు మ‌రి.

అటు హిందీ స‌హా ఇటు సౌత్ లోనూ ఈ అమ్మ‌డికి ఫ్యాన్సున్నారు. ప‌లువురు నిర్మాత‌లు త‌న‌కు హాట్ కంటెంట్ ఉన్న స్క్రిప్టుల్ని వినిపించార‌ని తెలుస్తోంది. అయితే వాటికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.