Begin typing your search above and press return to search.

ఇందుకేనా `చిత‌క్కొట్టుడు` బ్యూటీకి స‌లాం గులాం

By:  Tupaki Desk   |   22 Oct 2021 7:39 AM GMT
ఇందుకేనా `చిత‌క్కొట్టుడు` బ్యూటీకి స‌లాం గులాం
X
నేటిత‌రం నాయిక‌గా దూసుకెళుతోంది త‌మిళ సోయ‌గం నిక్కీ తంబోలీ. `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి ప్ర‌య‌త్న‌మే హీట్ పెంచే కంటెంట్ తో విరుచుకుప‌డింది నిక్కీ. ఆ త‌రువాత చేసిన `తిప్ప‌రా మీసం` పెద్ద‌గా ఆకట్టుకోలేదు కానీ లారెన్స్ మాస్టార్ తో కాంచ‌న 3లో న‌టించి ఆక‌ట్టుకుంది. దీంతో తెలుగులో త‌న స‌త్తా చాటాల‌నుకున్న నిక్కీకి చేదు అనుభ‌వ‌మే ఎదురైంది. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెల‌గాల‌నుకున్న ఆమె ఆశ‌లు ఆవిరైపోయాయి.

దీంతో బిగ్ బాస్ సీజ‌న్ 14లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే మ‌ధ్య‌లోనే బ‌య‌టికి వ‌చ్చేసింది. అందులో త‌న‌దైన స్టైల్లో ఓ కంటెస్టెంట్ తో రొమాన్స్ ని ర‌క్తిక‌ట్టించి వార్త‌ల్లో నిలిచిన నిక్కి మొత్తానికి క్రేజీ భామ‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. `ఖ‌త్రోంకీ ఖిలాడీ` షోలో పాల్గొంటున్న నిక్కీ నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్ ల‌తో సోష‌ల్ మీడియాని మాత్రం ఊపేస్తోంది.

తాజాగా నియాన్ గ్రీన్ డిజైన‌ర్ టాప్ లో అందాలని ప‌రిచేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది నిక్కి. దీనికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. ఇప్పుడీ ఫొటోలు ఇన్ స్టాని హీటెక్కిస్తున్నాయి. హీరోయిన్ గా నిక్కీ అందాలు..న‌ట‌న‌కు ఇప్ప‌టికే మంచి మార్చులు వేసింది యూత్. కుర్ర‌కారుని ప‌ర‌వ‌శింప‌జేసే ప‌రువాలు వున్నా నిక్కీకి ర‌వ్వంత అదృష్టం యాడైతే పెద్ద స్టార్ అయ్యేది అన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఇక హిందీ బిగ్ బాస్ లో నిక్కీ ఎంట‌ర్ టైన్ చేసిన తీరుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. పూజా హెగ్డే అంత స్టార్ డ‌మ్ చిక్క‌క‌పోయినా నిక్కీ త‌న‌కంటూ ఒక రేంజును ఆస్వాధించేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని విశ్లేషిస్తున్నారు.