Begin typing your search above and press return to search.

అలా బ‌ట‌న్స్ మ‌ర్చిపోతే గుండె గ‌ల్లంతే!

By:  Tupaki Desk   |   1 March 2022 5:30 PM GMT
అలా బ‌ట‌న్స్ మ‌ర్చిపోతే గుండె గ‌ల్లంతే!
X
బోల్డ్ బ్యూటీ నిక్కీ తంబోలి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు సినిమాతో తెలుగు యువ‌త‌కు మైండ్ బ్లాక్ చేసిన ఈ బ్యూటీ రాఘ‌వ లారెన్స్ `కాంచ‌న 3`లోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఫియర్ ఫ్యాక్టర్: కాట్రోన్ కే ఖిలాడి` టీవీ షోలో కూడా నటించింది.

ఇటీవ‌ల హిందీలో బిగ్ బాస్ 15 పార్టిసిపేషన్ తో మరింత ప్రజాదరణ పొందింది. ఈ బ్యూటీ వేడెక్కించే స్కిల్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌రం లేదు. ఫోటోషూట్ల‌లోనూ అద్భుతంగా ఎలా కనిపించాలో తెలుసు. ఇప్ప‌టికే నిక్కీ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో మ‌తులు చెడ‌గొడుతున్నాయి. తాజాగా మ‌రోసారి బోల్డ్ లుక్ తో హీటెక్కించింది నిక్కీ.

తాజాగా ఎల్లో బ్లేజ‌ర్ లో నిక్కీ ఇచ్చిన ఫోజు దుమారం రేపుతోంది. బ‌ట‌న్ లెస్ సూట్ లో క్లీవేజ్ షోను ప్రదర్శిస్తూ నిక్కీ ఘాటైన ఫోజుల‌తో చెల‌రేగింది. లేటెస్ట్ బోల్డ్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని చిద్రం చేస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది.

చీక‌ట్లోనే కాదు వెలుతురులోనూ నిక్కీ లో దూకుడు త‌గ్గ‌దుగా! అంటూ బోయ్స్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. మ‌రీ ఇంత‌గా టూమ‌చ్ గానా? అంటూ నెగెటివ్ కామెంట్లు కూడా ప‌డిపోతున్నాయ్.

ఇంత‌కుముందు హిందీ బిగ్ బాస్ తో మ‌న‌సులు దోచిన ఈ బ్యూటీకి బాలీవుడ్ లో ఛాన్సులొస్తున్నాయి. అటు హిందీ స‌హా ఇటు సౌత్ లోనూ ఈ అమ్మ‌డికి ఫ్యాన్సున్నారు. ప‌లువురు నిర్మాత‌లు త‌న‌కు హాట్ కంటెంట్ ఉన్న స్క్రిప్టుల్ని వినిపించార‌ని తెలుస్తోంది. అయితే వాటికి సంత‌కాలు చేసిందా లేదా అన్న‌ది త‌నే చెప్పాలి. ఇక నిక్కీ గ్లామ‌ర్ ని తెలుగు సినీప‌రిశ్ర‌మ స‌రిగా స‌ద్వినియోగం చేయ‌లేక‌పోయింద‌ని యూత్ ఆవేద‌న చెందుతున్నారు పాపం!!