Begin typing your search above and press return to search.

చీక‌టి గ‌ది లేకుండానే చిత‌క్కొడుతోంది!

By:  Tupaki Desk   |   13 Oct 2021 2:30 AM GMT
చీక‌టి గ‌ది లేకుండానే చిత‌క్కొడుతోంది!
X
`చీక‌టి గ‌దిలో చిత‌క‌కొట్టుడు` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హాట్ బ్యూటీ నిక్కి తంబోలీ. తొలి సినిమాలోనే హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగింది ఈ బ్యూటీ. అందాల ఆర‌బోత‌కు అడ్డు చెప్ప‌క‌ హాట్ పెర్పార్మెన్స్ తో మెప్పించింది. అయితే చిన్న సినిమా కావ‌డంతో ఆడియ‌న్స్ కి అంత‌గా రీచ్ కాలేదు. ఆ త‌ర్వాత `కాంచ‌న-3`..`తిప్ప‌రా మీసం` చిత్రాల్లో న‌టించింది. ఆ రెండు కూడా అనుకున్నంత‌గా గుర్తింపు తీసుకురాలేదు.

అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు టెంప్టింగ్ ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ కి ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా నిక్కి కొత్త ఫోటో షూట్ లో అందాల ఎలివేష‌న్స్ మంట‌లు పుట్టిస్తోంది. డార్క్ గ్రీన్ దుస్తుల్లో హీటెక్కించే అందాల విందు చేస్తోంది. ప్ర‌స్తుతం ఆ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఫాలోవ‌ర్స్ కామెంట్ల‌తో ఇన్ స్టాలో చెల‌రేగుతున్నారు.

ఇక నిక్కీ బాలీవుడ్ అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది. కానీ ఆ ఛాన్స్ రావ‌డం లేదు. కొన్ని బుల్లి తెర షో లు కూడా చేసింది. అలాగే పాప్ ఆల్బ‌మ్స్ లోనూ త‌నదైన‌ మార్క్ వేసింది. బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ ఫాం పైనా మెరిసింది. కానీ టైం క‌లిసి రావ‌డం లేదు. మ‌రి సంక‌ల్పంతో ప‌ట్టు విడ‌వ‌కుండా ముందుకు సాగుతుందా? ఎందుకులే అని లైట్ తీసుకుంటుందా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి.