Begin typing your search above and press return to search.

సునీల్ ట్రెండ్ ని మార్చేస్తా అంటోంది

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:30 AM GMT
సునీల్ ట్రెండ్ ని మార్చేస్తా అంటోంది
X
సునీల్ కృష్ణాష్టమితో టాలీవుడ్ తెరంగేట్రం చేయనున్న హీరోయిన్ నిక్కీ గల్రానీ. హీరోయిన్ సంజనకు చిట్టి చెల్లెలైన నిక్కీ.. రెండేళ్ల క్రితం మలయాళంలో అడుగు పెట్టి తెగ సినిమాలు చేసేస్తోంది. ఓ ఏడాది 15 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే నిక్కీ స్పీడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అవకాశాలు కలిసొచ్చి యాక్టర్ అయిపోయా కానీ.. అసలైతే ఈమెను డాక్టర్ చేయాలని పేరెంట్స అనుకున్నారట. అటు ఇంట్రెస్ట్ లేక ఫ్యాషన్ డిజైనింగ్ కి వెళ్లి, అక్కడ కుదురుకోలేక సినిమాల్లో అవకాశం రాగానే వచ్చేశానంటోంది నిక్కీ గల్రానీ.

తెలుగులో సునీల్ తో అరంగేట్రం గురించి ఆరా తీసి, సునీల్ పక్కన నటించిన హీరోయిన్స్ కి మంచి ఆఫర్స్ రావనే టాక్ గురించి ఈమెని క్వశ్చన్ చేస్తే.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది నిక్కీ. 'ఓ హీరో కారణంగా ఇలాగేం జరగదు. స్టోరీతో పాటు ఇంకా చాలా అంశాలను పరిశీలించాలి. అయినా ఇది ఓ స్టార్ హీరో(బన్నీ) కోసం తయారు చేసిన స్టోరీ. జనాలు ఈ కాన్సెప్ట్ ను యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం నాకుంది. అంతే కాదు.. సునీల్ పక్కన నటిస్తే ఛాన్సులు రావనే ట్రెండ్ కి నేను బ్రేక్ వేస్తా' అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది నిక్కీ.

ప్రతీ సినిమాకి మార్పు చూపించాలని అనుకుంటుందట ఈ బెంగళూరు బేబీ. ప్రస్తుతం చేస్తున్న మలయాళ మూవీలో విలేజ్ గాళ్ పాత్ర అయితే.. కృష్ణాష్టమి ఎన్నారై అమ్మాయి రోల్ చేస్తున్నానని చెప్పింది నిక్కీ గల్రానీ. ప్రేమకథా చిత్రం తమిళ్ రీమేక్ తో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ పాప.. ప్రస్తుతం పటాస్ రీమేక్ లోనూ నటిస్తూ.. లారెన్స్ దగ్గర డ్యాన్సులు నేర్చుకుంటున్నట్లు చెబ్తోంది.