Begin typing your search above and press return to search.

నక్క తోక తొక్కడం అంటే ఇదే

By:  Tupaki Desk   |   23 Feb 2016 3:30 PM GMT
నక్క తోక తొక్కడం అంటే ఇదే
X
ఎవరికైనా అనుకోకుండా సూపర్‌ సక్సెస్‌ దక్కిందనుకోండి.. అప్పుడు తెలుగులో మనం వాడే సామెత.. ''నక్కతోక తొక్కి వచ్చారు'' అంటాం. ఇప్పుడు బెంగుళూరు బ్యూటి నిక్కి గల్రాని గురించి మనం అలాగే చెప్పుకోవాల. ఈమె మామూలు నక్కలపై కాదు.. అలాస్కాలో మంచులో ఉండే రేర్‌ జాతి నక్క తోకపై కాలేసి వచ్చిందని అనుకోవచ్చు.

అదేంటో మరి లక్‌ కాకపోతే.. తెలుగులో అమ్మడి తొలి సినిమా ''కృష్ణాష్టమి''.. అలాగే హీరోయిన్‌ చేసిన ఆమె రెండో తమిళ సినిమా ''యగవారాయనుమ్‌ నా కాక'' తెలుగులో ''మలుపు'' సినిమాగా.. ఒకే రోజు రిలీజ్‌ అయ్యాయ్‌. అంటే అమ్మడికి ఒకే రోజు రెండు సినిమాలు అనమాట. మలుపు సినిమా తమిళంలో ఆల్రెడీ ఫ్లాప్‌. ఇక కష్ణాష్టమి సినిమాకు ఫ్లాపు టాకే వచ్చింది. అయినాసరే.. కృష్ణాష్టమి నిర్మాత దిల్‌ రాజును కాపాడేశేలా ఉంది. ఇక మలుపు సినిమా ఇక్కడ జనాలకు తెగ నచ్చేయడంతో.. డబ్బింగ్‌ వర్షెన్‌ తో ఒరిజినల్‌ వర్షెన్‌ పోగొట్టిన డబ్బులన్నీ వచ్చేలా ఉన్నాయ్‌. చూస్తుంటే అనుకోకుండా నిక్కీ గల్రానికి రెండు సినిమాలూ మేలే చేసినట్లు లేదూ?

ఇప్పుడు తెలుగులో అమ్మడిని చాలామంది దర్శకుడు సంప్రదిస్తున్నారు. త్వరలోనే ఏదో ఒక సినిమాలో ఓకె అయిపోయే ఛాన్సుందట. దిల్‌ రాజు క్యాంపులోనే రెండు సినిమాలను చేయనున్నట్లు ఆఫ్‌ ది రికార్డు నిర్మాతగానే సక్సెస్‌ మీట్‌ లో వెల్లడించడం కొసమెరుపు. నిక్కీ.. నక్క తోక తొక్కేశావ్‌ అంతే!!