Begin typing your search above and press return to search.

యువ‌హీరోపై వేధింపుల ఆరోప‌ణ‌

By:  Tupaki Desk   |   11 Dec 2018 5:09 AM GMT
యువ‌హీరోపై వేధింపుల ఆరోప‌ణ‌
X
రంగం` ఫేం - యువ‌హీరో జీవా అందాల క‌థానాయిక నిక్కీ గ‌ర్లానీని వేధించారా? అంటే అవున‌నే సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌ల మీటూ ఉద్యమ నేప‌థ్యంలో క‌థానాయిక‌ల వేధింపుల ప్ర‌హ‌స‌నం బ‌య‌ట‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. జీవాతో కమిట్‌ మెంట్ కాద‌న‌డం వ‌ల్ల అత‌డు క‌క్ష క‌ట్టి ఇండ‌స్ట్రీలో త‌న‌కు అవ‌కాశాల్లేకుండా చేస్తున్నాడ‌ని నిక్కీ సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంతో క‌ల‌క‌ల‌రం రేగింది.. అయితే ఇలా ఓ యంగ్ హీరోపై ఆరోప‌ణ‌ల వ్య‌వ‌హారంలో నిజం ఎంత‌? అని నిక్కీ గ‌ర్లానీనే ప్ర‌శ్నిస్తే అట్నుంచి షాకిచ్చే విష‌య‌మే తెలిసింది.

అస‌లు జీవా అలాంటి వ్య‌క్తి కాదు. పైగా నాకు మంచి మిత్రుడు. త‌న‌తో ఏనాడూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిందే లేద‌ని నిక్కీ గ‌ర్లానీ చెబుతోంది. జీవా పైనా - నాపైనా ఎవ‌రో కుట్ర చేసి ఇలా చేస్తున్నారు. అస‌లు సామాజిక మాధ్య‌మాల్లో నేను ఎలాంటి పోస్టును పెట్ట‌లేద‌ని నిక్కీ గ‌ర్లానీ వివ‌ర‌ణ ఇచ్చింది. ప‌రిస్థితి చేజారిపోతుంద‌నిపించింది. అందుకే ఇప్పుడిలా వివ‌ర‌ణ ఇస్తున్నాన‌ని నిక్కీ పేర్కొంది.

అయితే జీవాపై ఎవ‌రో ప‌ని గ‌ట్టుకుని కుట్ర చేస్తున్నారా? ఇది ప్ర‌త్య‌ర్థుల‌ ప‌నేనా? నిక్కీ గ‌ర్లానీ ట్విట్ట‌ర్ - ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో ఆ పోస్టింగులు చేసిందెవ‌రు? అంటూ అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం నిక్కీ గ‌ర్లానీ త‌న ట్విట్ట‌ర్‌ - ఇన్‌ స్టా పోస్టుల్ని తొల‌గించింది. అకౌంట్‌ ని సెక్యూర్డ్ గా మార్చుకుంద‌ట‌. నిక్కీ గ‌ర్లానీ ఇప్ప‌టికే త‌మిళంలో పాపుల‌ర్ హీరోయిన్ అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది.