Begin typing your search above and press return to search.

అందాలు ఆర‌బోస్తే 30ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్..!

By:  Tupaki Desk   |   1 Nov 2021 3:30 AM GMT
అందాలు ఆర‌బోస్తే 30ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్..!
X
టీవీ న‌టి మోడ‌ల్ నికితాశర్మ అధికారిక ఇన్ స్టాగ్ర‌మ్ లో నిరంత‌ర వీడియోలు ఫోటోల‌కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. వ‌రుస ఫోటోషూట్లు క్రియేటివ్ స్ట‌ఫ్ తో పాటు ఫిట్నెస్ యోగా క్లాసుల‌తోనూ నికిత అంత‌ర్జాలంలో బాగా పాపుల‌రైంది. తాజాగా 30ల‌క్ష‌ల అనుచ‌రులను త‌న ఖాతాలో వేసుకుంది ఈ బ‌బ్లీ బ్యూటీ. 3 మిలియన్లకు ధన్యవాదాలు!! అంటూ ల‌వ్ ఈమోజీని షేర్ చేసింది నికిత‌.

ఈ మైలురాయిని చూసినప్పుడు నాకు గుర్తుకు వచ్చేది అంతే! అంటూ న‌మ‌స్కారం ఈమోజీని నికిత షేర్ చేసింది. మీలో ప్రతి ఒక్కరూ లేకుండా నేను ఇది చేయలేను. మొదటి నుండి నన్ను అనుసరిస్తున్న వారికి నాకు అతుక్కుపోయినందుకు ధన్యవాదాలు! నా కుటుంబంలో చేరుతున్న వారి కోసం నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను! మీ ఫీడ్ ని ఆసక్తికరంగా మార్చాలని మీ జీవితాల్లో కొంచెం మెరుపు వినోదాన్ని జోడించాలని నేను ఆశిస్తున్నాను.. అని నికిత ఈ సంద‌ర్భంగా సందేశాన్నిచ్చింది.

అన్న‌ట్టు ఈ బ్యూటీ అటు బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లోనూ అవ‌కాశాల కోసం వేచి చూస్తోంది. టాలీవుడ్ లో ప్ర‌ముఖ దర్శ‌కులు త‌న‌కు ఆఫ‌ర్ ఇస్తే చేసేందుకు సిద్ధంగానే ఉంది. కానీ ఆ ఒక్క ఛాన్స్ ఎప్ప‌టికి ద‌క్కేనో?