Begin typing your search above and press return to search.

పూల్ సైడ్ మోటివేష‌న్ స్పీక‌ర్ ఏంటో ఇలా

By:  Tupaki Desk   |   21 Oct 2021 3:30 PM GMT
పూల్ సైడ్ మోటివేష‌న్ స్పీక‌ర్ ఏంటో ఇలా
X
ఆర‌డుగుల ఎత్తు.. ఎత్తుకు త‌గ్గ ఛ‌మ‌క్కు.. కాస్త బొద్దుగా ఉంటేనేం.. బొద్దే ముద్దు అంటూ బోలెడంత ప్ర‌మోష‌న్. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ అంటే.. ఫేమ‌స్ మోటివేష‌న్ స్పీక‌ర్ .. వ్య‌క్తిత్వ వికాస నిపుణురాలు .. టీవీ న‌టి నిఖితా శ‌ర్మ‌.

నిఖిత నిరంత‌రం త‌న కుటుంబ స‌భ్యుల‌తో లైఫ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వ‌రుస ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే.. ఇక ఈ బ్యూటీ పూల్ సైడ్ అన్ లిమిటెడ్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. టీవీ న‌టి నికితాశ‌ర్మ బికినీ లుక్ లేటెస్టుగా సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. పూల్ సైడ్ ఇలా రంగు రంగుల ఫ్లోర‌ల్ బికినీలో క‌నిపించింద‌. అలా నీళ్ల‌లో నిల‌బ‌డి కెమారాకి ఫోజు ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ నిఖితా టూపీస్ మత్తులో మునిగిపోతున్నారు. హాటెస్ట్ కామెంట్ల‌తో విరుచుకుపడు తున్నారు.

సునామీ హెచ్చ‌రిక‌లా నిఖిత ఇలా విరుచుకుప‌డుతుంద‌నుకోలేదు! అంటూ యూత్ ఒక‌టే కామెంట్ల‌ను గుప్పిస్తోంది. కాక‌లు రేపుతోన్న అందాల సోయ‌గం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంత‌కీ ఎవ‌రీ నిఖితా శ‌ర్మ అంటే? నిఖితా నేటివ్ ప్లేస్ ఢిల్లీ. అక్క‌డే పుట్టి పెరిగింది. మోటివేష‌న్ స్పీక‌ర్ గా ఇంత‌కుముందు ఫేమ‌స్ అయ్యింది. ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అవార్డులు రివార్డులు ద‌క్కించుకుంది. అటుపై పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి ప్ర‌వేశించింది. కానీ సినిమా అవ‌కాశాలు రాలేదు. చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది గానీ..బాలీవుడ్ లో ఏద‌ర్శ‌క నిర్మాత ఎంక‌రేజ్ చేయ‌లేదు. దీంతో బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ మాత్రం బాగానే స‌క్సెస్ అయింది. చాలా సీరియ‌ళ్లు..షోల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం బుల్లి తెర‌పై యాక్టివ్ గానే ఉంది.

సినిమాల్లో అవ‌కాశాలు కోసం ఇంకా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక ఇన్ స్టాలో నిఖితా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. ఇలాంటి టెప్టింగ్ ఫోటోల‌తో కాక‌లు రేప‌డం త‌న‌కు కొత్తేమీ కాదు. నిఖిత ఇన్ స్టాలో ఎంతో జోవియ‌ల్ గా ఉండే ఫోటోగ్రాఫ్స్ వీడియోల‌కు కొద‌వేమీ లేదు. అందుకే నిఖితా పాలోవ‌ర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. నిఖితా శ‌ర్మ రెగ్యుల‌ర్ అప్ డేట్స్ తో ఫాలోవ‌ర్స్ అటెన్ష‌న్ ని డ్రా చేస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా బాలీవుడ్ లో ఏదైనా ఛాన్స్ వ‌స్తుందేమో చూద్దాం.