Begin typing your search above and press return to search.

మోటివేష‌న్ క్లాస్ తీస్కున్న శ‌ర్మా గాళ్

By:  Tupaki Desk   |   12 Jun 2021 11:30 AM GMT
మోటివేష‌న్ క్లాస్ తీస్కున్న శ‌ర్మా గాళ్
X
సోష‌ల్ మీడియాల్లో న‌టి కం మోటివేష‌న్ స్పీక‌ర్..వ్య‌క్తిత్వ వికాస నిపుణురాలు నిఖిత శ‌ర్మ క్లాసుల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస వీడియోల‌తో నిఖిత క్లాస్ తీస్కునే విధానం యువ‌త‌రానికి పిచ్చిగా న‌చ్చేస్తుంది.

మోడ‌ల్ గా రాణిస్తూనే క‌థానాయిక‌గానూ ఎదిగేందుకు నిఖిత ప్ర‌య‌త్నాల్లో ఉంది. తాజాగా నిఖిత శ‌ర్మ షేర్ చేసిన ఓ మోటివేష‌న‌ల్ వీడియో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. మ‌గువ‌ల్ని ఇది తొడుక్కోకూడ‌దు అది తొడుక్కో కూడ‌ద‌ని స‌ల‌హాలిస్తుంటారు. ఫ్యాట్ త‌గ్గించాల‌ని బొద్దుగా ఉండ‌కూడ‌ద‌ని లేదా ఫ‌లానా డ్రెస్సింగ్ సెన్స్ అల‌వ‌రుచుకోవాల‌ని స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చే స‌మాజం మ‌నది.

మ‌న‌ల్ని మ‌నం సంఘంలో ఎలా ఆవిష్క‌రించుకోవాలో అలంక‌ర‌ణ ఎలానో తెలుగుసుకోవడం చాలా చాలా అవ‌స‌రం అని నిఖిత శ‌ర్మ క్లాస్ తీస్కుంది. అయితే ఇదంతా ఒక మోటివేష‌న్ త‌ర‌హాలో కేవ‌లం మైమ్ ద్వారా మాత్ర‌మే చెప్ప‌డం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. నిఖిత శ‌ర్మ నాగిని 5 సీరియ‌ల్ లో న‌టిస్తోంది. టీవీఎస్ స్కూటీ .. లేస్ ప్ర‌క‌ట‌న‌ల్లోనూ నిఖిత శ‌ర్మ న‌టించింది. దిల్లీ నుంచి ముంబై వెళ్లి ఫిలింస్కూల్ లో స్ట‌డీస్ ని కొన‌సాగించింది. అటుపై వ‌రుస‌గా సీరియ‌ళ్ల‌లో న‌టిస్తోంది.