Begin typing your search above and press return to search.

పెళ్లికి రెడీ అనేసిన పులి పిల్ల ఇక అంతేగా

By:  Tupaki Desk   |   18 April 2022 2:10 AM GMT
పెళ్లికి రెడీ అనేసిన పులి పిల్ల ఇక అంతేగా
X
ఇటీవ‌ల టాలీవుడ్ బాలీవుడ్ లో వ‌రుస పెళ్లి బాజాలు హాట్ టాపిక్ గా మారాయి. అభిమాన తార‌లు ఒక్కొక్క‌రుగా పెళ్లితో ఓ ఇంటివాళ్ల‌వుతున్నారు. కొంద‌రు బ్యాచిల‌ర్ షిప్ ని విడిచిపెట్టేందుకు స‌సేమిరా అంటున్నా కానీ అనూహ్యంగా పెళ్లి డేట్ త‌రుముకొస్తోంది.

అనుష్క శ‌ర్మ‌- దీపిక‌- శ్రీ‌య‌- నిహారిక‌- కాజ‌ల్- క‌త్రిన‌- ఆలియా భ‌ట్ ఇలా అంతా పెళ్లితో ఓ ఇంటివాళ్ల‌య్యారు. అయితే ఇంకా ఈ జాబితాలో చేరే ముద్దుగుమ్మ‌లు ఇంకెంద‌రు ఉన్నారు? అంటే.. న‌య‌న‌తార ఇప్ప‌టికే సీక్రెట్ పెళ్లి చేసుకున్నార‌న్న టాక్ ఉంది. అనుష్క - త‌మ‌న్నా పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. ప‌లువురు నాయిక‌లు పెళ్లి కోసం రెడీ అవుతున్నార‌ని డేటింగ్ లో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇంత‌లోనే కొమ‌రం పులి బ్యూటీ నికీషా ప‌టేల్ పెళ్లికి రెడీ అవుతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం అభిమానుల్లో కోలాహాలానికి కార‌ణ‌మైంది. ఇన్నాళ్లు అందాల‌ నికీషా ఒంట‌రిగానే ఉంద‌ని భావించిన వారికి షాకిస్తూ.. తాను బ్రిట‌న్ లో ఒక‌ యువ‌కుడిని పెళ్లాడేందుకు రెడీగా ఉన్నాన‌ని తెలిపింది. అయితే అత‌డు ఎన్నారైనా లేక బ్రిటీష‌రా అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. ఏది ఏమైనా కానీ ప్ర‌స్తుతం నికీషా సింగిల్ కాదు.. డేటింగ్ లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక నికీషా ప‌టేల్ కెరీర్ అంతంత మాత్ర‌మే. తెలుగు - త‌మిళం- క‌న్న‌డంలో న‌టించినా కానీ ఇటీవ‌ల స‌రైన ఆఫ‌ర్లు లేవు. ఇక పెళ్లి బాజాకి టైమొస్తే ఏదీ ఆగ‌ద‌న్న‌ది తెలిసిన‌దే.

స‌డెన్ గా అలా అనేసిందేమిటీ!ప్రేమించ‌డం టైమ్ వేస్ట్.. రిలేష‌న్ తో ఇంకా పెద్ద టైమ్ వేస్ట్! దాని గురించి ఆలోచించ‌డ‌మే పెద్ద వృధా!! అంటూ ఒక‌ప్పుడు ప్ర‌క‌టించిన‌ నికీషా ప‌టేల్ ఇంత‌లోనే మాట మార్చింది. ఈ దిల్లీ బ్యూటీ ఇంత‌కుముందు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న కొమ‌రం పులి చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆరంగ‌ట్ర‌మే ఈ భామ‌కు ‌కెరీర్ ప‌రంగా పెద్ద ఫ్లాప్ ఎదురైంది.

ఆ త‌ర్వాత ఏ విధంగానూ నికీషా ఆశించినంత పెద్ద స్టార్ కాలేక‌పోయింది. అదంతా అటుంచితే అస‌లు ప్రేమ‌లోనూ పెద్ద ఫెయిల్యూర్ ఎదుర్కొన్న విర‌హ‌యోగినిలా నికీషా ఇచ్చిన గ‌త‌ స్టేట్ మెంట్ తో ఇప్ప‌టి ప్ర‌క‌ట‌న ఎక్క‌డా సింక్ అవ్వ‌లేదు.

కానీ నికీషా ప్రేమించడం పెద్ద టైమ్ వేస్ట్.. అని చెప్పింది ఇదివ‌ర‌కూ. కేవలం ప్రేమ మాత్రమే కాదు.. సంబంధంలో ఉండటం కూడా టైమ్ వేస్ట్ అనేసింది. "నా దృష్టిలో ప్రేమ రిలేష‌న్ షిప్ అనేవి ఉండటం వ్యర్థం. అవి నా భావాలకు విరుద్ధం.. విసుగు తెప్పిస్తాయి" అని అంది. ఆ వ్యాఖ్య‌ల‌తో ప్రేమలో పెద్ద దెబ్బ తింది పాపం ప‌సిపాప‌! అంటూ చాలా మంది అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కానీ ఇంత‌లోనే బ్రిట‌న్ ప్రేమికుడి మాయ‌లో ప‌డి ఇప్పుడు మాట మార్చేసింద‌న్న‌మాట‌!