Begin typing your search above and press return to search.
#Nikhil20 ..మొఘలుల దండయాత్రకు ముందు...!?
By: Tupaki Desk | 31 May 2023 11:18 PMధిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు!.. మహేష్ బాబు డైలాగ్ ఇది. కానీ దీనిని అక్షరాలా తూచ తప్పక ఆచరిస్తున్నాడు ప్రామిసింగ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. మారిన ట్రెండ్ కనుగుణంగా తనను తాను మలుచుకుంటూ ఎంపిక చేసుకునే కథల్ని కూడా అతడు ఎంతో తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా మూసకు దూరంగా యువహీరో చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
నిజానికి భారతదేశ చరిత్రలో హద్దులు చెరిపేసే పాన్ ఇండియా కథలు ఎన్నో అందుబాటులో ఉన్నా వాటిని టచ్ చేస్తున్నది అతికొద్ది మంది దర్శకనిర్మాతలు హీరోలు మాత్రమే. ఇప్పుడు అలాంటి ఒక ప్రత్యేకమైన జానర్ బెండ్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకుంటూ తెలివైన ఎత్తుగడలతో నిఖిల్ ముందుకు సాగుతున్నాడు. పేరున్న నటవారసులకు కూడా రాని ఆలోచనలతో అతడు ప్రత్యేక ప్రణాళికలతో దూసుకుపోతున్నాడు.
రొటీనిటీ అనే కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి హద్దులు దాటి పెద్ద స్థాయి కంటెంట్ తో యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలను చేసేందుకు నిఖిల్ తనకు తానే సవాల్ విసురుకుంటున్న తీరు అభినందనీయం. నిఖిల్ 20వ చిత్రం భీకరమైన చారిత్రక కథతో గంభీరతకు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతుంది. ఇది ఒక పురాతన హిస్టరీకి చెందిన ఫాంటసీ స్టోరి. ఒక యోధుని థ్రిల్లింగ్ ఒడిస్సీ. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ - శ్రీకర్ నిర్మిస్తున్న ఈ మెగా-బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి భరత్ కృష్ణమాచారి మెగాఫోన్ పట్టనున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
నిఖిల్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు మేకర్స్ ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. పోస్టర్ లో నంది ఉన్న సెంగోల్ కనిపిస్తుంది. రేపు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఫెరోషియస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాటు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందనున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ- రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్ప డైలాగ్స్ అందించారు.
ఈ సినిమా కథలో ప్రత్యేకతలు:
• మన చరిత్రలో చెప్పబడినట్లుగా సెంగోల్ ధర్మానికి ప్రతీక. అది 'వాకింగ్ స్టిక్' కాదనే వాస్తవాన్ని నిర్ధారించే చిత్రం.
• పాలకుడి బాధ్యతను ప్రతిబింబించే ప్రాచీన భారతీయ నాగరికత చిహ్నం.
• మొఘలుల దండయాత్ర తర్వాత కొత్తగా అభిషేకించిన రాజుకు సెంగోల్ సమర్పించే ఆచారం విస్మరించబడింది
• సెంగోల్ ను పట్టుకున్న రాజు నీతిమంతుడు.. న్యాయంగా పాలించి ప్రజలకు న్యాయాన్ని అందించడంలో నిష్పక్షపాతంగా ఉంటాడనే సంజ్ఞ ఇది.
• ఈజిప్ట్- మెసొపొటేమియా- గ్రీస్- బ్రిటీష్ సంస్కృతిలో కూడా రాజు ఒక చేతిలో రాజ దండాన్ని పట్టుకున్నాడు - కానీ అది శక్తి అధికారానికి చిహ్నం. భారతీయ నాగరికతలో ఇది న్యాయాన్ని నిలబెట్టడానికి చిహ్నం.
• సెంగోల్ లోని 'ఎద్దు' భారతీయ సంస్కృతికి చెందిన 'నంది'ని సూచిస్తుంది. ఇది భక్తుల అభ్యర్థనలు ప్రార్థనలను వింటుందని నమ్ముతారు. శివునికి కేవలం అభ్యర్థనలను మాత్రమే తీసుకుంటుంది. చెడును సంపూర్ణంగా ఫిల్టర్ చేస్తుంది. అదేవిధంగా రాజు ఏ కారణం చేతనైనా ఏ వ్యక్తి, .. శాఖ లేదా సమూహం వైపు మొగ్గు చూపకుండా పరిపూర్ణంగా నిష్పక్షపాతంగా ఉండాలని భావిస్తున్నారు.
• సెంగోల్ రాజు అతని రాజ్యానికి గర్వకారణం.
• రాజు చేతిలో సెంగోల్ పట్టుకుంటే తప్ప అతను సరైన పాలకుడిగా పరిగణించబడడు.
• ప్రతి శక్తి మార్పు సమయంలో సెంగోల్ తయారు చేయబడదు. కానీ ఒక రాజు నుండి మరొక రాజుకు బదిలీ చేయబడుతుంది.
• భారతీయ రాజుల పురాతన సెంగోల్ దండయాత్రల కారణంగా కాలక్రమేణా తప్పిపోయింది.