Begin typing your search above and press return to search.

#6ప్యాక్ క్ల‌బ్.. లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా..!

By:  Tupaki Desk   |   22 Dec 2020 10:15 AM IST
#6ప్యాక్ క్ల‌బ్.. లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా..!
X
6 ప్యాక్ క్ల‌బ్ లో మొద‌టి హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డులు సృష్టిస్తే.. అత‌డి స్ఫూర్తితో టాలీవుడ్ లో ఇత‌ర అగ్ర హీరోలు కూడా 6ప్యాకుల‌తో మెరిపించారు. నితిన్ లాంటి ట్యాలెంటెడ్ యంగ్ హీరో ఏడెనిమిదేళ్ల క్రిత‌మే 6ప్యాక్ హీరోగా స‌త్తా చూపించాడు. అక్కినేని అఖిల్ ఈ క్ల‌బ్ లోనే ఉన్నాడు. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌రకొండ‌.. నాగ‌శౌర్య.. సందీప్ కిష‌న్ లాంటి యువ‌హీరోలు 6ప్యాక్ ల‌తో మురిపిస్తున్నారు.

ఇప్పుడు ఇదే క్ల‌బ్ లో మ‌రో ట్యాలెంటెడ్ టాలీవుడ్ యంగ్ హీరో చేరాడు. అత‌డే మిస్ట‌ర్ నిఖిల్. తాజాగా నిఖిల్ షర్ట్ ‌లెస్ ఫోజు అంత‌ర్జాలంలో దుమారం రేపుతోంది. పెళ్లి త‌ర్వాత 6 ప్యాక్ బావుంది గురూ! అంటూ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ లో డాక్టర్ పల్లవి వర్మను పెళ్లాడిన అత‌డిలో రెట్టించిన‌ నూత‌నోత్సాహం క‌నిపిస్తోంది.

నిరంత‌రం అత‌డు జిమ్ ని విడిచిపెట్ట‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. వంద‌శాతం ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో క‌నిపిస్తున్నాడు. యాబ్స్ టోన్డ్ మ‌జిల్స్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. ట్విట్ట‌ర్ లో ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని అత‌డు షేర్ చేశాడు. నిఖిల్ సిద్ధార్థ్ ఈ ఫోటోకి ‘రా’ అని క్యాప్షన్ పెట్టాడు.

అన్న‌ట్టు అస‌లే కొత్త‌ల్లుడు.. జ‌న‌వ‌రి రానే వ‌చ్చేస్తోంది. సంక్రాంతి పండ‌గ కు అత్తారింట్లో బాగా లాగించాల్సి ఉంటుంది. అయితే ప్యాకింగులు తొల‌గిపోకుండా నిఖిల్ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడ‌నే భావిద్దాం. అన్న‌ట్టు నిఖిల్ కెరీర్ తొలి సోలో బ్లాక్ ‌బస్టర్ చిత్రం ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ 2’ త్వరలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళుతోంది. చందుమొండేటి ఆ ప‌నిలో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు బాస్ అర‌వింద్ కాంపౌండ్ లో 18 పేజెస్ మూవీలోనూ నిఖిల్ న‌టిస్తున్నాడు.