Begin typing your search above and press return to search.

2020 ఫిబ్ర‌వ‌రి లో నిఖిల్ బాజా

By:  Tupaki Desk   |   14 Dec 2019 6:51 AM GMT
2020 ఫిబ్ర‌వ‌రి లో నిఖిల్ బాజా
X
నిఖిల్ క‌థానాయ‌కుడి గా న‌టించిన `అర్జున్ సుర‌వ‌రం` ఇటీవ‌లే రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ముందు ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌లు నెల‌కొన్నా ఈ సినిమా నిఖిల్ ని న‌టుడిగా మ‌రో మెట్టు పైకి తీసుకెళ్లింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇదే హుషారులో 2020 నిఖిల్ కి అన్ని ర‌కాలుగా క‌లిసి రానుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా ప‌లు క్రేజీ చిత్రాల‌కు నిఖిల్ స‌న్నాహాలు చేస్తున్నాడు. అర్జున్ సుర‌వ‌రం రిజ‌ల్ట్ తేలింది కాబ‌ట్టి త‌దుప‌రి కార్తికేయ 2 ఖాయ‌మైంది. చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

త‌దుప‌రి సుకుమార్ రైటింగ్స్ లో `కుమారి 21ఎఫ్` దర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్ తో ఓ సినిమాకి నిఖిల్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా? ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో హనుమాన్ అనే చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. వీటితో పాటు మ‌రిన్ని సినిమాల్ని నిఖిల్ ఫైన‌లైజ్ చేయ‌నున్నాడ‌ట‌. ఈలోగానే నిఖిల్ నుంచి మ‌రో గుడ్ న్యూస్ వ‌చ్చింది.

నిఖిల్ పెళ్లి కొత్త సంవ‌త్స‌రంలో ఉంటుంద‌ట‌. 2020 ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి లో నిఖిల్ పెళ్లాడ‌బోతున్నాడ‌ని తాజాగా రివీలైంది. ఇప్ప‌టికే త‌న లేడీ ల‌వ్ డాక్ట‌ర్ తేజ‌స్విని తో నిశ్చితార్థం అయ్యింది. ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో త‌న‌ని క‌లుసుకున్నాడు. ప్రేమ‌లో ప‌డ్డాడు. అటుపై నిశ్చితార్థం ఖాయం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక పెళ్లి తేదీ ఫ‌లానా! అన్న స‌మాచారం ఒక్క‌టే రావాల్సి ఉంది. ఇక తేజ‌స్విని బ్యాక్ గ్రౌండ్ గురించి ప్ర‌శ్నిస్తే.. ఓ బిజినెస్ ఫ్యామిలీ అని రివీలైంది. కొత్త సంవ‌త్స‌రంలో నిఖిల్ తో పాటు ప‌లువురు యంగ్ హీరోల డోలు బాజా మోగ‌నుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది. హీరో నితిన్ పెళ్లికి లైన్ క్లియ‌రవుతోంద‌న్న వార్త ఇటీవ‌ల వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే.