Begin typing your search above and press return to search.

యంగ్ హీరో సైలెన్స్ కి కార‌ణమేంటి..?

By:  Tupaki Desk   |   20 Dec 2020 3:30 AM GMT
యంగ్ హీరో సైలెన్స్ కి కార‌ణమేంటి..?
X
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. 'హ్యాపీ డేస్' సినిమాతో అడుగుపెట్టి తనదైన నటనతో సినిమాలు చేస్తున్నాడు. గతేడాది 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నిఖిల్.. మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ముందుకు నిఖిల్ హిట్ సినిమా 'కార్తికేయ' కి సీక్వెల్ గా 'కార్తికేయ 2' చిత్రాన్ని ప్రకటించారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల‌ నిర్మిస్తున్నారు. దీంతో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అలానే నిఖిల్ తన కెరీర్లో 20వ చిత్రాన్ని నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ నిర్మాణంలో చేయనున్నాడు. అయితే ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలు ఉన్నా నిఖిల్ మాత్రం సైలెంటుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ - స్క్రీన్ ప్లే అందిస్తున్న '18 పేజెస్' సినిమా షూటింగ్ మొదలు పెట్టి ఈ మధ్య కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రెండేళ్ల నుంచి న‌లుగుతున్న 'కార్తికేయ 2' చిత్రం మాత్రం ఇంకా తిరిగి సెట్స్ మీద‌కి రాలేదు. మార్చిలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వస్తోంది. ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి మరో సినిమా చేస్తున్నాడని అంటున్నారు. థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక ఏషియన్ వారితో చేయబోయే భారీ బడ్జెట్ చిత్రానికి డైరెక్టర్ మరియు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక ఇంకా పూర్తైనట్లు వెల్లడించలేదు. ఇదంతా చూస్తూంటే నిఖిల్ ఈ మూడు సినిమాలను 2021లోనే పూర్తి చేసే ఆలోచ‌న చేస్తున్నాడామో అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా 'అర్జున్ సురవరం' హిట్ తర్వాత నిఖిల్ కాస్త స్లో అయ్యాడ‌నే కామెంట్స్ అయ్యే వినిపిస్తున్నాయి.