Begin typing your search above and press return to search.
హైదరాబాద్ శివారులో నిఖిల్ పెళ్లికి ముస్తాబైన విల్లా అదే!
By: Tupaki Desk | 14 May 2020 1:00 AM ISTపూర్వం పెద్దలు పలికిన 'కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు’ అనే సామెత ఇప్పుడు తెలుగు యంగ్ హీరోకి వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కడి పెళ్లిలు అక్కడే నిలిచిపోయాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ముప్పై దాటి ఇంకా పెళ్లి చేసుకొని హీరోల లిస్ట్ పెద్దదే ఉంది. అయితే ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కుదామనుకున్న హీరోలు.. ఇప్పటివరకు తమ పెళ్లిలను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే హీరో నితిన్ పెళ్లి వాయిదా పడింది. ఇదివరకు హీరో నిఖిల్ కూడా ఇదే చేశాడు. ఏ కరోనా నా పెళ్లి ఆపలేదని, మా జంట పెళ్లిని ఏ శక్తీ ఆపలేదు, రెండు కుటుంబాలు ఉంటే చాలు అని చెప్పిన నిఖిల్.. ఇప్పుడు తన పెళ్లిని త్వరత్వరగా కానిచ్చేస్తున్నాడు. నిఖిల్ భీమవరంకు చెందిన డాక్టర్ పల్లవితో ఫిబ్రవరిలో నిశ్చితార్ధం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు.
కరోనా వైరస్ ముప్పుని తీవ్రం అవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించింది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇక ఇటీవలే ‘అర్జున్ సురవరం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న హీరో నిఖిల్, పల్లవికి గోవాలో తన ప్రేమ తెలిపి వారి పెద్దల్ని కూడా ఒప్పించి మరి పెళ్లి ఖాయం చేసుకున్నాడు. పైగా ఎక్కడైతే ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. డాక్టర్ పల్లవి వర్మని మొదటిసారి చూసినప్పుడే నిఖిల్ ప్రేమించాడట. మొత్తానికి ప్రేమించిన అమ్మాయినే అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి రెండోసారి నిర్ణయించిన మే 14న ఉదయం 6:31 గంటల సమయంలో ఇరు కుటుంబీకుల సమక్షంలో జరగనుంది. షామీర్‌పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ విల్లాలో నిఖిల్, పల్లవి వర్మల వివాహం జరగబోతోంది. విల్లాను ఇప్పటికే విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. రేపు వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగనుందని సమాచారం.