Begin typing your search above and press return to search.

నిఖిల్ తో డ్యాన్స్ మాష్టర్ రీమేక్??

By:  Tupaki Desk   |   2 April 2017 8:12 AM GMT
నిఖిల్ తో డ్యాన్స్ మాష్టర్ రీమేక్??
X
కన్నడలో హిట్టయిన సినిమా 'కిర్రాక్ పార్టీ'. ఆ సినిమాతో ఫుల్ పాపులర్ అయిపోయిన హీరోయిన్ రష్మిక మందనా అనే అమ్మాయిని ఇప్పుడు నాగ శౌర్య తెలుగులోకి తెస్తుంటే.. అసలు ఈ సినిమానే తెలుగులోకి దించేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చేసింది నిర్మాత అనిల్ సుంకరకు. ఈ మధ్యనే ఈయన ఒక మరాఠి సినిమాను ఈడోరకం ఆడోరకం అంటూ తెలుగులోకి రీమేక్ చేసి హిట్టు కొట్టేశారుగా.. అదే ఊపును కంటిన్యూ చేస్తున్నారు.

ఇప్పుడు మనోళ్ళు కన్నడ సినిమా కిరాక్ పార్టీ రీమేక్ చేయడానికి రైట్స్ కొనేశారట. అయితే రీమేక్ అనుకున్న తరువాత ఉన్న కంటెంట్ ను యాజిటీజ్ ఎక్కించేస్తే చాలు కాబట్టి.. దర్శకుడు ఎవరైనా కూడా పర్లేదు అనే ఫీలింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఎప్పటినుండో దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్న కొరియోగ్రాఫర్ రాజు సుందరం చేతిలో డైరక్షన్ పగ్గాలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇంతకీ సినిమాలో హీరో ఎవరు? ఇప్పటికే హీరో నిఖిల్ తో డిస్కషన్లు జరిపేసి అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చేశారట.

అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే.. వేరే బాషల్లో హిట్టయిన సినిమాలను ఇక్కడ హిట్ చేయడం అంత ఈజీ కాదు. ధృవ అండ్ ఖైదీ నెం 150 హిట్టయ్యాయ్ కాని.. కాటమరాయుడు కొట్టలేకపోయింది. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్ అయిన నిఖిల్ ఈ విషయంలో కేర్ తీసుకుంటే బెటర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/