Begin typing your search above and press return to search.

స్పై.. నిఖిల్ ఇంత కష్టపడ్డాడా?

By:  Tupaki Desk   |   27 Jun 2023 2:48 PM GMT
స్పై.. నిఖిల్ ఇంత కష్టపడ్డాడా?
X
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ పేరు ముందు వినపడుతుంది. అందరిలా మూస పద్దతిలో కాకుండా, ఆయన ఎంచుకునే సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి. డిఫరెంట్ జోనర్స్ మూవీని ఎంచుకొని తన కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నాడు.

ఇటీవల కార్తికేయ2 సినిమాతో హిట్ కొట్టిన ఆయన స్పై మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటోంది.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 1945లో విమాన ప్రమాదానికి గురయ్యారు. అయితే, ఆ ప్రమాదంలో ఆయన చనిపోలేదని, మిస్ అయ్యాడని ఇలా, ఆయన మరణంపై చాలా మిస్టరీ ఉంది.

ఈ మిస్టరీ పై తెరకెక్కిన సినిమానే స్పై. ఈ మూవీలో నిఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. ఆ మిస్టరీ వెనక ఉన్న రహస్యాలను ఆయన బయటకు తీసే పాత్రలో నిఖిల్ నటించాడు.

కాగా, ఈ మూవీ కోసం నిఖిల్ చాలా కష్టపడ్డాడు. మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, నిఖిల్ ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే, ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలోనే ఆయన తాను పడిన కష్టాన్ని వివరించారు.

క్రావ్ మాగా అనే ఇజ్రాయెల్ డిఫెన్స్ మిలిటరీ ట్రైనింగ్ లో ఆయన శిక్షణ పొందారట. అంతేకాదు ఆయుధాల నిర్వహణ, RAW అధికారులు చేసే పనులు ఇలా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నారట.

జూడో, కరాటే, బాక్సింగ్, రెజ్లింగ్ లలో శిక్షణ పొందారట. రా లో పని చేసిన ఏజెంట్లు, అధికారులకు, గూడఛారులను కలిసి వారితో మాట్లాడారట. కేవలం వారితో మాట్లాడి విషయం తెలుసుకోవడం కాదు, వారి బాడీ లాంగ్వేజ్ లను తెలుసుకున్నారట. ఇవన్నీ చూస్తుంటే, ఈ మూవీ కోసం నిఖిల్ ప్రాణం పెట్టి నటించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ మూవీ జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. బీహెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. మరి వీరు ఇంత కష్టపడి చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.