Begin typing your search above and press return to search.

అనుప‌మ‌పై నిఖిల్ చుర‌క‌లు.. ఇలాగైతే ఎలా అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   1 Aug 2022 9:30 AM GMT
అనుప‌మ‌పై నిఖిల్ చుర‌క‌లు.. ఇలాగైతే ఎలా అమ్మ‌డు?
X
ఆక‌ట్టుకునే అందం, అంత‌కు మించిన టాలెంట్ ఉన్నా.. స‌క్సెస్ రేటు లేని హీరోయిన్ల లిస్ట్ లో అనుపమ పరమేశ్వరన్ ఒక‌రు. వ‌రుస సినిమాలు చేస్తున్నా.. ఒక్క‌టీ హిట్ అవ్వ‌డం లేదు. త్వ‌ర‌లోనే ఈ అమ్మడు `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్ట‌ర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న థ్రిల్ల‌ర్ మూవీ ఇది.

2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ `కార్తికేయ‌`కు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా న‌టిస్తే.. అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, ఆదిత్యా మీన‌న్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ క‌లిసి నిర్మించిన ఈ చిత్రం జూలైలోనే రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ఎట్ట‌కేల‌కు ఆగ‌స్టు 12న అట్ట‌హాసంగా ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నారు. భక్తి, సైన్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై.. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్ మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఆ అంచ‌నాల‌ను మ‌రింత పెంచ‌డం కోసం మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న హీరో నిఖిల్‌.. సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను షేర్ చేసుకున్నాడు. అలాగే హీరోయిన్ అనుప‌మ ప్ర‌మోష‌న్స్ కు రాదంటూ ఆమెపై న‌వ్వుతూనే చుర‌క‌లు కూడా వేశాడు. `ఉదయం ఐదు గంటలకే షూటింగ్ అన్నా వచ్చేస్తుంది.. చాలా ప్రొఫెషనల్‌గా, ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ సినిమా ప్రమోషన్లంటే ఆమె నుంచి స్పంద‌న ఉండ‌దు` అంటూ నిఖిల్ కామెంట్స్ చేశాడు.

దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. వాస్త‌వానికి అనుపమ మొద‌ట్లో సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొనేది. కానీ, ఇప్పుడా చురుకుద‌నం క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన నాని `అంటే..సుంద‌రానికీ`లో అనుప‌మ ఓ పాత్ర‌ను పోషించింది. కానీ, విడుద‌ల స‌మ‌యంలో ఆమె క‌నీసం ఒక్క ఇంట‌ర్వ్యూలో కూడా పాల్గొన‌లేదు. అస‌లు సినిమా చూసేంత వ‌ర‌కు ఆమె ఉంద‌న్న విష‌య‌మే ఎవ‌రికీ తెలియ‌లేదు.

ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమా ప్రమోషన్లలో కూడా అనుపమ పెద్దగా కనిపించడం లేదు. అస‌లే స‌క్సెస్ రేట్ త‌క్కువ‌గా ఉన్న అనుప‌మ‌.. ఇలా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు డుమ్మా కొడితే ఎలా అని, దాని వ‌ల్ల‌ కెరీర్ మ‌రింత ఎఫెక్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సినీ ప్రియులు హిత‌వు ప‌లుకుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా అనుప‌మ ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ అవుతుందో..లేదో..చూడాలి.