Begin typing your search above and press return to search.

నేను అనుకున్నదే మోడీ చేశాడు: నిఖిల్

By:  Tupaki Desk   |   9 Jan 2019 11:55 AM IST
నేను అనుకున్నదే మోడీ చేశాడు: నిఖిల్
X
అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై హీరో నిఖిల్ తన స్పందనను ట్వీటర్ ద్వారా వెల్లడించారు. పేదలకు 10శాతం కోటా రిజర్వేషన్ ను తాను స్వాగతిస్తున్నానని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం బేషుగ్గా ఉందని కితాబిచ్చారు.

కాగా ఇటీవల రానా యాంకర్ గా ఉన్న నెం.1 యారీ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు తమ మధ్య ఇలాంటి చర్చే జరిగిందని తెలిపాడు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ అంశంపై రానా, నేను చర్చించుకున్నామని తెలిపాడు. మంగళవారం పేదలకు 10శాతం రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారని మీడియాలో చూశానని తెలిపాడు. రానా, నేను అనుకున్నదే మోడీ అమలు చేయడం సంతోషకంగా ఉందని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు.

కాగా పేదలకు పదిశాతం రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. లోక్ సభలో సస్పెన్షన్ కారణంగా టీడీపీ ఎంపీలు బిల్లుకు దూరంగా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బిల్లు స్వాగతించారు.

హీరో నిఖిల్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తే కొందరు నెటిజన్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. మోడీ నిజంగా అగ్రవర్ణాలపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దిగిపోయే ముందు ప్రవేశపెట్టడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏం చేశారని నిలదీస్తున్నారు. ఈ బిల్లు వల్ల మోడీకి తప్పా ఎవరీ ప్రయోజనం లేదని పెదవి విరుస్తున్నారు. 10శాతం రిజర్వేషన్ బిల్లు విపక్షాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే దీనిని తెరపైకి తీసుకొచ్చారని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.