Begin typing your search above and press return to search.

ప్చ్..! నిఖిల్ హ‌నీమూన్ నిరాశేనా?

By:  Tupaki Desk   |   11 March 2020 4:13 AM GMT
ప్చ్..! నిఖిల్ హ‌నీమూన్ నిరాశేనా?
X
యంగ్ హీరో నిఖిల్ ఎన‌ర్జీ గురించి తెలిసిందే. డైల‌మాలోనూ డ్యాషింగ్ హీరోగా నిరూపించుకుంటున్నాడు. క్లారిటీగా సెల‌క్టివ్ గా క‌థ‌ల్ని ఎంచుకుంటూ స‌త్తా చాటుతున్నాడు. హ్యాపీడేస్ త‌ర్వాత స్వీయ ప్ర‌ణాళిక‌తో హీరోగా రాణిస్తున్నాడు. కెరీర్ మిడిల్ లో అనేక ఫెయిల్యూర్స్ తర్వాత కంబ్యాక్ అయిన‌ హీరోగా స‌త్తా చాటాడు. ఇటీవల `అర్జున్‌ సురవరం`తో విజయాన్ని అందుకుని ఇప్పుడు ఫుల్‌ స్వింగ్ లో ఉన్నాడు. ర‌క‌ర‌కాల డైల‌మాల న‌డుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటింది.

సూప‌ర్ హిట్ మూవీ `కార్తికేయ`కు సీక్వెల్ ని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు చందుమొండేటి సినిమా కోసం లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. మరోవైపు సుకుమార్‌ రైటింగ్స్- జీఏ2 ప్రొడక్షన్‌లో `18పేజెస్‌` పేరుతో మరో కొత్త సినిమాని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. `కుమారి 21ఎఫ్‌`ఫేమ్‌ సూర్య ప్రతాప్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 2020 వ‌రుస‌ షూటింగ్ లతో నిఖిల్‌ ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు.

కెరీర్ ఒకెత్తు అనుకుంటే.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ మ‌రో ఎత్తు. నిఖిల్ పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడ‌య్యేందుకు ఎగ్జ‌యిటింగ్ గా వెయిట్‌ చేస్తున్నాడు. భీమవరానికి చెందిన డా.పల్లవిని పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే షూటింగ్ లతో బిజీగా ఉన్న నిఖిల్ కి పెళ్ళి పనులు చూసుకునే తీరిక దొరకడం లేదట‌. క్షణం తీరిక లేకుండా ఓ వైపు షూటింగ్‌లు.. మరోవైపు పెళ్ళి పనులు చూడాల్సి వ‌స్తోంద‌ట‌. తాను నటిస్తున్న 'కార్తికేయ 2'ని దసరా స్పెషల్ గా విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకే గ్యాప్‌ లేకుండా సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారట. తన వీక్‌ ఆఫ్ ల్లోనే మ్యారేజ్ ని కంప్లీట్‌ చేసుకోవాలని.. హనీమూన్ ని మాత్రం ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్ లు పూర్తయిన తర్వాతనే చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

సినిమాల కోసం హనీమూన్ ని వాయిదా వేసుకుంటున్నాన‌ని నిఖిల్ తెలిపారు. ఓ ఇంట‌ర్వ్యూ లో నిఖిల్ మాట్లాడుతూ- ``ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా. చేతినిండా పనుంది. ఇటీవలే మిస్టరీ థ్రిల్లర్‌ `కార్తికేయ 2' ప్రారంభమైంది. అదే సమయంలో పెళ్ళి పనులు కూడా ఫుల్‌ స్వింగ్ లో నడుస్తున్నాయి. నా ఫోకస్‌ మాత్రం సినిమాలపైనే ఉంది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనే ఉద్దేశంతో టైమ్‌తో పాటు పరిగెడుతున్నాం. నా పెళ్ళిని కేవలం వీక్‌ ఆఫ్‌ రోజుల్లోనే చేసుకోబోతున్నా. హనీమూన్ ని మాత్రం షూటింగ్‌ పూర్తయ్యేంత వరకు వాయిదా వేసుకున్నా. ఎందుకంటే హనీమూన్‌ చేసుకునే టైమ్‌ లేదు`` అని వెల్లడించారు. నిఖిల్‌ పరిస్థితి పై ఫ్యాన్స్ అరెరే అంటూ ఇదైపోతున్నారు. అరే పాపం హనీమూన్ కి కూడా టైమ్‌ లేదా అంటూ సోషల్‌ మీడియా లో ఫ్యాన్స్ వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్నారు.