Begin typing your search above and press return to search.

యంగ్ హీరో కెరీర్ వ‌ర్రీస్‌.. నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్‌

By:  Tupaki Desk   |   27 Jan 2022 10:31 AM GMT
యంగ్ హీరో కెరీర్ వ‌ర్రీస్‌.. నెట్టింట ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
X
క‌రోనా చాలా మంది జీవితాల్ని త‌ల‌క్రిందులు చేసింది. సాఫీగా సాగుతున్న జీవితాల్లో క‌ల్లోలాన్ని మిగిల్చింది. దీని ధాటికి చాలా మంది జీవితాలు మారిపోయాయి. హ్యాపీగా జీవితం కొత్త ట‌ర్న్ తీసుకుంటుంద‌ని కోటి ఆశ‌ల‌తో వున్న వారు ఇప్పుడు కెరీర్ ప‌ట్ల వ‌ర్రీ అవుతున్నారు. ట‌లీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కెరీర్ కూడా ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా కొంత అప్ సెట్ అయింది. కెరీర్ విష‌యంలో నిఖిల్ వ‌ర్రీ అవుతున్నాడు. కార‌ణం త‌ను న‌టించిన సినిమా విడుద‌లై దాదాపు మూడేళ్ల‌వుతోంది. నిఖిల్ 2019లో `అర్జున్ సుర‌వ‌రం` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

ఈ మూవీ కూడా అనేక ఆటుపోట్ల మ‌ధ్య విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా నిఖిల్ కెరీర్ కి మ‌రింత జోష్‌ని అందించింది. ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని చాలా మంది అనుమానాన్ని వ్య‌క్తం చేశారు కూడా. అలాంటి ప‌రిస్థితుల నుంచి త‌న సినిమాని బ‌య‌ట‌ప‌డేసి సూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న ఈ యంగ్ టాలెంటెడ్ హీరోకు ఇప్పుడు కొత్త‌గా కెరీర్ భ‌యం ప‌ట్టుకుంది. త‌ను ప్ర‌స్తుతం రెండు చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం `18 పేజెస్‌`. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని ప‌ల్నాటి సూన్య ప్ర‌తాప్ తెర‌కెక్కించాడు. చిత్రీక‌ర‌ణ పూర్తయి ఈ మూవీ రిలీజ్ కి రెడీగా వుంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న `కార్తీకేయ 2` చిత్రీక‌ర‌ణ పూర్తి కావాల్సి వుంది. అయితే ఈ రెండు చిత్రాల రిలీజ్ లు క‌రోనా కార‌ణంగా గ‌త కొన్ని నెల‌లుగా గంద‌ర‌గోళంలో ప‌డ్డాయి. ఇది నిఖిల్ కి ఇబ్బందిక‌రంగా మారింది. ఈ నేఫ‌థ్యంలో హీరో నిఖిల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

`పాండ‌మిక్ కార‌ణంగా కెరీర్ లు ఈ లెవెల్ కి రావ‌డం చాలా విచారంగా వుంది. `అర్జున్ సుర‌వ‌రం` సూప‌ర్ స‌క్సెస్ త‌రువాత 4 చిత్రాల‌ని అంగీక‌రించాను. 4 బ్రిలియంట్ స్క్రిప్ట్స్. ఈ చిత్రాల‌పై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. అయితే రిలీజ్ డేట్ లు మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా మారాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని ఆ దేవుడు మార్చాల‌ని, స‌రైన డేట్ ల‌లో సినిమాలు రిలీజ్ అయ్యేలా చూడాల‌ని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాను` అంటూ హీరో నిఖిల్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఏపీ టికెట్ విధానంతో పాటు థియేట‌ర్ల స‌మ‌స్య‌పై బాహాటంగానే స్పందించిన నిఖిల్ ఇలా కెరీర్ విష‌యంలో భ‌యాందోళ‌న‌కు గుర‌వుతుండ‌టం ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు విస్మాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైనా టాలెంటెడ్ హీరోగా త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ని సంత‌రించుకున్న నిఖిల్ మ‌ళ్లీ త‌న సినిమాల‌తో స‌త్తా చాటాల‌ని, త‌న చిత్రాల‌కు మంచి జ‌ర‌గాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కోరుకుంటున్నాయి.