Begin typing your search above and press return to search.

2019 లో ట్రిపుల్ రిలీజులు అంటున్న హీరో

By:  Tupaki Desk   |   9 Jan 2019 7:00 AM IST
2019 లో ట్రిపుల్ రిలీజులు అంటున్న హీరో
X
యంగ్ హీరో నిఖిల్ ఈమధ్యే తన తాజా చిత్రం 'ముద్ర' షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. తమిళ సూపర్ హిట్ 'కనిదన్' కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కాకుండా నిఖిల్ మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడట. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు నిఖిల్.

"గత కొన్ని వారాలుగా కథలు వింటూ కొత్త ప్రాజెక్టులను సైన్ చేస్తూ ఉన్నాను. ఈ ఏడాదిలో 3 సినిమాలు విడుదల అవుతాయి. ఇది నా హామీ. రేపటి నుంచి ఒక్కో ప్రాజెక్టు ప్రకటిస్తాను. మనందరికీ 2019 ఒక ఫెంటాస్టిక్ ఇయర్ కావాలి. బిలేటెడ్ న్యూ ఇయర్ విషెస్ ఫ్రెండ్స్" అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. ఈలెక్కన నిఖిల్ ఫ్యాన్స్ కు రెండు మూడు రోజులు పండగేనన్నమాట. నిఖిల్ కు మంచి సబ్జెక్టులు ఎంచుకుంటాడని పేరుంది. మరి ఎవరెవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఏమో.

ఇదిలా ఉంటే నిఖిల్ లాస్ట్ సినిమా 'కిరాక్ పార్టీ' బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. మరి ఈ ఏడాది కొత్త సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తాడేమో వేచి చూడాలి. మూడు సినిమాల్లో మొదట రిలీజ్ కానున్నది 'ముద్ర' తమిళంలో పెద్ద హిట్ కాబట్టి ఇక్కడ కూడా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.